

- 1993-94 కత్తిపూడి ఉన్నత పాఠశాల విద్యార్థులు అపూర్వ కలయిక….
శంఖవరం మన న్యూస్ (అపురూప్):
చదువులమ్మ చెట్టు నీడలో చెట్టాపట్టాలేసుకుని కలసితిరిగిన ఆ స్నేహితులు ఆదివారం ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు. స్నేహితులంతా ఒకటై స్నేహబంధాన్ని మరింతగా బలపర్చుకొన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి ఉన్నత పాఠశాలలో 1993-94 సంవత్సరంలో పదోవ తరగతి పూర్తి చేసిన విద్యార్ధులంతా 30 ఏళ్ల తర్వాత కలుసుకోవడంతో అలనాటి పాత జ్నాపకాలను నెమరు వేసుకొని కత్తిపూడి ఉన్నత పాఠశాలలో ఆటపాటలతో ఉల్లాసంగా, ఉత్సహంగా గడిపారు. వివిధ వృత్తుల్లో, ఉద్యోగ, వ్యాపారాల్లో స్థిరపడి వివిధ ప్రాంతాల్లో ఉన్న వారంతా ప్రస్తుత బిజీ షెడ్యూల్లో కూడా స్నేహ బంధమే ముఖ్యమంటూ ఒకచోట కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు సంతోషంగా గడిపారు. ముందుగా గురుదేవోభవ అంటూ గురువులకు ఏమిచ్చినా వారి రుణం తీర్చుకోలేమని గురుదక్షిణలో భాగంగా విద్యను బోధించిన గురువులను ఘనంగా సన్మానించి వారి ఆశీస్సులను పొందారు. పూర్వ విద్యార్థులంతా తమ వయసుని సైతం పక్కనపెట్టి వినోద కార్యక్రమాలు పాల్గొని గీతాలాపన చేస్తూ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. ముందుగా పరిచయం కార్యక్రమం నిర్వహించారు. అలాగే గ్రూప్ ఫోటో దిగి తమ జ్ఞాపకాలను పదిలం చేసుకున్నారు. మరొకసారి కలుద్దాం అంటూ ఒకరిని ఒకరు ఆత్మీయ వీడ్కోలు చెప్పుకున్నారు. ఈ ఆత్మీయ కలయిక కు కృషి చేసిన స్నేహితులును తోటి విద్యార్థులు అభినందించారు