• తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలిపిన గొర్లి నాగేశ్వరరావు..

శంఖవరం మన న్యూస్ (అపురూప్): జమ్ము కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు గొర్లి నాగేశ్వరరావు తీవ్రంగా ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియచేసి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కొత్తూరు గ్రామంలో జనసైనికులతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదులు దాడిలో పర్యాటకుల మృతులకు సంతాపం తెలియచేస్తూ మూడు రోజులపాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీ చేసి మరణించిన వారికి నివాళులు అర్పించామని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉగ్రవాద దాడులపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *