

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: జమ్మూ కశ్మీర్ లోని పెహల్గాంలో ఉగ్రవాదుల దాడిలొ మిలటరీ, సామాన్యులను, పర్యాటకులను ఇలా ఇంతమందిని దారుణంగా చంపడం జరిగింది ఇది దేశ సమగ్రతను విచ్ఛిన్నం చేయడానికి కొంతమంది విచ్ఛిన్నకారులు ఉగ్రవాదులు చేస్తున్న ప్రయత్నం ఈ ఉగ్రదాడి ఈ దాడికి నిరసనగా మృతులకు సంతాపం సూచికంగా బద్వేల్ నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం నుంచి బద్వేల్ సెంటర్ లోని నాలుగు రోడ్ల కూడలి వరకు కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త (POC) బసవీ రమేష్, బద్వేల్ చిన్న, చెరువు నీటి సంఘం ఉపాధ్యక్షులు దద్దం వెంకటేశ్వర్లు (DV), బద్వేల్ మండల అధ్యక్షులు తరుణ్, అట్లూరు మండల నాయకులు పెంచలయ్య, కొండప్ప, ఇమ్రాన్ మరియు జన సైనికులు వీర మహిళలు సుజాత, జమున, హరీనా, నాయబ్ రసూల్ పాల్గొనడం జరిగింది.