

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్ ): ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలోని ఉన్న 9 సచివాలయంలో అనేక సమస్యల నడుమ కొనసాగుతోంది.ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించలేక పోవడంతోపాటు అందులో పని చేసే ఉద్యోగులు కనీస సౌకర్యాలు లేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రం20 వార్డులకు గాను 9 సచివాలయం ను ఏర్పాటు చేశారు. ఈ సచివాలయంలో సుమారుగా 10 నెలల కాలంగా ప్రింటర్ పనిచేయడం లేదు. అంతేకాకుండా సచివాలయాలో సరైన సౌకర్యం కూడా లేవు. వివిధ పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు వన్ బి,అడంగల్,కుల ధ్రువీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్,నివాసం పత్రం తదితర ప్రభుత్వ సేవలకు రుసుము చెల్లించి అప్లై చేస్తే దానికి సంబంధించిన పత్రం కోసం ప్రైవేట్ నెట్ సెంటర్లు,మీ సేవ కేంద్రాలలో మరోసారి రుసుము చెల్లించి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.అంటే ఒక ప్రభుత్వ సేవ కోసం రెండు సార్లు రుసుము చెల్లించే పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. వ్యయ ప్రయాసలతో ప్రజలు సచివాలయానికి వస్తే అక్కడ ఉద్యోగులు ఉన్నా కూడా పనులు జరగక మరో సచివాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా సచివాలయంలో ఆరుగురు ఉద్యోగులలో దాదాపు ముగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ 9సచివాలయంలో పలు సమస్యల మధ్య ఉద్యోగులు పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది. వీరికి ప్రాథమిక అవసరాలు తీర్చుకోవడానికి తాత్కాలిక తాగడానికి మంచి నీళ్లు కూడా అధికారులు పట్టించుకోవడం వలన అవి నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో మహిళా ఉద్యోగులు ప్రజలు అవసరాల కోసం పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సచివాలయంలో పలు సమస్యల మధ్య ఉద్యోగులు పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడింది,సుమారు కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే నగర పంచాయతీలో ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం బాధాకరం. ఇప్పటికైనా ఉన్నతాధికారులకు స్పందించి ప్రజల సౌకర్యార్థం సచివాలయంలో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుకుంటున్నారు.