

- సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర బృందం…
శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- కాకినాడ ఎమ్మార్సీ నందు ఆర్.బి అసోసియేట్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ వారు ఆధ్వర్యంలో శంఖవరం మండలం యొక్క 2024-25 ఆర్ధిక సంవత్సరం సంబంధించి ఇంటర్నల్ ఆడిట్ నిర్వహించడం జరిగింది. ఈ ఆడిట్ లో పీఎం శ్రీ స్కూల్ యొక్క నిధులు వినియోగం మరియు, కాంప్లెక్స్ నిధులు గురించి, కేజీబీవీ, మోడల్ స్కూల్ రైస్ వినియోగం గురించి ఆడిట్ నిర్వహించి, రికార్డ్స్ వెరిఫై చేసి, రికార్డ్స్ నిర్వహణ పై సంతోషం వ్యక్తం చేయటం జరిగింది, ఈ ఆడిట్ కు మండల అకౌంటెంట్ వి.ఈశ్వరుడు మరియు ఇతర మండల అకౌంటెంట్స్ హాజరైనారు.