హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

మనన్యూస్,హైదరాబాద్:నెల్లూరు,75వ పుట్టినరోజు సందర్భంగా 75 కిలోల కేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు
చంద్ర దర్శనం పుస్తక ఆవిష్కరణ
హైదరాబాదులోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జన్మదిన వేడుకల్లో పాల్గొన్న టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్, సీనియర్ నేతలు బక్కాని నరసింహులు, పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, టీటీడీ బోర్డు సభ్యులు నన్నూరి నర్సిరెడ్డి తదితరులు.
ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ…………….
ప్రజల కష్టాలు తెలుసుకుని పాలన అందించే నాయకుడు చంద్రబాబు నాయుడని కొనియాడిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.ఎన్నో సంస్కరణలు తేవడం ద్వారా తెలుగురాష్ట్రాల దశదిశ మార్చిన విజనరీ లీడర్ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు.
హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఎయిర్ పోర్టు…ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులకు అంకురార్పణ జరిగింది ఆయన ఆలోచనలు, విజన్ తోనే అని తెలిపారు.
ఈ రోజు తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1గా ఉందంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలే కారణం అని అన్నారు.
ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేసే అవకాశం నాకు దక్కింది అని అన్నారు.నలభై ఏళ్లుగా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు సాగుతున్నామని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాం అని తెలియజేశారు.హైదరాబాద్ ను కోల్పోయామనే బాధ ఉన్నప్పటికీ, అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు అని అన్నారు.

  • Related Posts

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..