

మనన్యూస్,తిరుపతి:తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ 80 వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం తిరుపతిలోని పాస్ మనోవికాస్ కేంద్రంలోని పిల్లలకు ఆల్పాహారంతో పాటు పండ్లను పంపిణీ చేశారు. తిరుపతి బ్యాంక్ ఎంప్లాయిస్ కోఆర్డినేషన్ కమిటీ ప్రధాన కార్యదర్శి ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని బ్యాంకు ఉద్యోగుల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగుల శ్రేయస్సు కోసం సర్వీస్ నిబంధనలు ద్వైపాక్షిక చర్చల ద్వారా వేతన ఒప్పందం పెన్షన్ సౌకర్యం, బ్యాంకుల జాతీయ కరణ వంటి వాటి వెన్ను నాయకుల ఆశ్రయ సాధన కోసం ఉద్యోగుల కళ్ళల్లో ఆనందం రావాలని ఏఐబిఇఏ పని చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు భాస్కర్, నరసింహులు, జనార్ధన్, నందగోపాల్, సుమలత, రేష్మ, నిర్మల,మహేష్, పవన్,వెంకటరెడ్డి, లక్ష్మీపతి బ్యాంక్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.
