బడుగు, బలహీన వర్గ ప్రజల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్………..చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి

*బడుగు, బలహీన వర్గ ప్రజల అభ్యున్నతి కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అవిశ్రాంతంగా శ్రమించిన గొప్ప వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్.*బాబా సాహెబ్ అంబేద్కర్ దురదృష్టవశాత్తు కొన్ని ప్రాంతాలలో కొందరివాడిగా చిత్రీకరించబడ్డారు. వాస్తవానికి ఆయన అందరివాడు.*అంబేద్కర్ స్ఫూర్తి తో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు పరిచిన చరిత్ర తెలుగుదేశం పార్టీ ది.*బలహీన వర్గాలకు అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేసి అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచిన ఘనత వైసీపీ ది. మన న్యూస్ నెలూరు ,ఏప్రిల్ 14 :భారత రాజ్యాంగ నిర్మాత డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 135 వ జయంతిని పురస్కరించుకొని టిడిపి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయం నందు వేడుకల ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన టిడిపి శ్రేణులు అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిధి గా హాజరయ్యారు. భారత దేశ నిర్మాణం లో బాబా సాహెబ్ అంబేద్కర్ పోషించిన పాత్ర, వారు అందించిన సేవలను కొనియాడారు.ఈ సందర్బంగా టిడిపి నెల్లూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ…………బాబా సాహెబ్ అంబేద్కర్ దేశంలోనే కాదు ప్రపంచ మేధావి గా కీర్తించబడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.బడుగు, బలహీన, అణగారిన ప్రజలకు రాజ్యాంగ రక్షణ కల్పించిన వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు.దేశ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి దేశ ప్రజల కోసం, అణగారిన ప్రజల హక్కుల కోసం రాజ్యాంగాన్ని రూపొందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు.విభిన్న సంస్కృతులు, భాషలు, కులాలు, మతాల సమ్మేళనమైన భారతదేశంలో ప్రతి ఒక్కరు ఐక్యంగా, స్వేచ్చగా జీవించే హక్కులను రాజ్యాంగం ద్వారా కల్పించిన మహానుభావుడు అంబేద్కర్ అని అన్నా రు.అంబేద్కర్ స్ఫూర్తి తో బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ఎన్ టి ఆర్, నారా చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వ హయాంలో అమలు పరిచారు అని అన్నా రు.వైసీపీ తమ 5 ఏళ్ల పాలన లో బడుగు బలహీన వర్గాల పై దాడులకు తెగబడటమే కాకుండా వారికి అందుతున్న సంక్షేమ పథకాలను రద్దు చేసి అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడిచింది అని అన్నా రు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నెలకొన్నాక తిరిగి వారికి రక్షణ కల్పించి, వారికి అందుతున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి ఫలాలను పునరుద్దరించడం జరిగిందిఅని అన్నా రు.అనంతరం టిడిపి రాష్ట్ర కార్యదర్శి జెన్ని రవణయ్య మాట్లాడుతూ……….నిమ్న జాతుల హక్కుల కోసం, రిజర్వేషన్ ల సాధన కోసం, వారిలో చైతన్యం నింపడం కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తి బాబా సాహెబ్ అంబేద్కర్అని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాణం తో, విలువైన సూచనలతో భారత జాతికి దిశా నిర్దేశం చేసిన మహనీయుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.అంటరానితనం, వివక్ష లపైఅలుపెరుగనిపోరాటం సాగించిన గొప్ప వ్యక్తి డా. బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా పండుగ వాతావరణం లో జరుపుకుంటున్నాము అని అన్నారు. అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యం గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పని చేస్తున్నారు. బలహీన వర్గాల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను అందిస్తున్నారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ ఎస్ సి సెల్ రాష్ట్ర కార్యదర్శి శైలేంద్ర బాబు, నగర టిడిపి అధ్యక్షులు మామిడాల. మధు, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు పి ఎల్ రావు, కార్యాలయం కార్యదర్శి ఊరందూరు సురేంద్ర, తెలుగు మహిళా అధ్యక్షురాలు పనబాక భూ లక్ష్మి, ఐటీడీపి అధ్యక్షుడు షేక్ రసూల్, వాణిజ్య విభాగం అధ్యక్షులు దర్శి హరికృష్ణ, TNSF అధ్యక్షుడు అమృల్లా, చేనేత సంఘం నాయకులు ఆశం సురేష్, నన్నే సాహెబ్, శివాచారి, తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి కొమరిగిరి విజయమ్మ, పొత్తూరు శైలజ, నగర మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి, శైలేంద్ర బాబు, ధర్మవరపు గణేష్, బ్రహ్మం గుప్తా,ఖజానా బ్రహ్మయ్య, ఆనంద్, అబూ బకర్,తెలుగు మహిళ నేత శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    మహేశ్వరం, మన ధ్యాస: మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో,కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది ఆపరేటర్లు ఈ వృత్తిపై ఆధారపడి…

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    ఉదయగిరి : (మన ద్యాస న్యూస్ ) : ప్రతినిధి నాగరాజు :///// ఉదయగిరి మండల కేంద్రం జి చెర్లోపల్లి గ్రామంలో బీసీ కులాలకు చెందిన కొంతమంది ఎస్సీ కాలనీలో జొరబడి స్థలాలను ఆక్రమించి వారిపై దాడులకు దారితీసి కులం పేరుతో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    • By JALAIAH
    • September 11, 2025
    • 3 views
    విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

    సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..