

మన న్యూస్, నెల్లూరు రూరల్,ఏప్రిల్ 12 : నెల్లూరు రూరల్,వేదాపాళెం నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విగ్రహం నుండి డైకాస్ రోడ్డు వరకు రోడ్డును పరిశీలించిన నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.2 కోట్ల 70 లక్షల రూపాయలతో రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తాము అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.అతి త్వరలోనే గాంధీనగర్ రోడ్డు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసి వేగవంతంగా పూర్తి చేసి, ప్రజలకు అందిస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్ గా నిలబెడతాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.పై కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
