మన న్యూస్: భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర సమరయోధుడు, జానపద నాయకుడు బిర్స ముండా అని పినపాక గ్రామ ప్రత్యేక అధికారి ఎంపీడీవో రామకృష్ణ అన్నారు. నవంబర్ 2024న బిర్స ముండా 150వ జయంతి వేడుకల సందర్భంగా పినపాక గ్రామపంచాయతీ నందు ఏర్పాటుచేసిన గ్రామసభకు ఎంపీడీవో రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన సమాజానికి ఆయన చేసిన సేవలు మరువలేనివని,19వ శతాబ్దపు చివరి రోజుల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలియనేరియన్ ఉద్యమానికి సారిధ్యం వహించాడని, 22 ఏళ్ళ వయసులోనే బ్రిటీషర్లపై యుద్ధం ప్రకటించాడని తద్వారా స్వాతంత్రోద్యమ చరిత్రలో ప్రముఖ వ్యక్తిగా నిలిచిన ఆయన గౌరవార్థం భారత పార్లమెంటులో సెంట్రల్ హాల్లో అతని చిత్రపటం కూడా ఉంచారని తెలిపారు. బిర్స ముండా జయంతిని పురస్కరించుకొని గ్రామసభలో పాల్గొన్న గ్రామస్తుల చేత పరిసరాల పరిశుభ్రత గంజాయి మాదకద్రవ్యాల నిర్మూలన, స్వచ్ఛమైన గ్రామ సంకల్పానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ సభలో పాల్గొన్న గిరిజనులను ఈ సందర్భంగా ప్రత్యేకంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ ఉమామహేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

భారతదేశ విముక్తి కోసం మేడే ఒక స్ఫూర్తి మే డే అంటే(అంతర్జాతీయ కార్మిక దినోత్సవం)రేణిగుంట మే 1రేణిగుంటలో వాడవాడల మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి మురళి గారు మాట్లాడుతూప్రతి సంవత్సరం మే 1న కార్మికుల హక్కులు, త్యాగాలను స్మరించుకుంటూ జరుపుకునే రోజు. 1886 మే 1న అమెరికాలోని షికాగోలో ‘8 గంటల పని దినం’ కోసం జరిగిన చారిత్రాత్మక సమ్మె, హేమార్కెట్ దురదృష్టకర సంఘటనల ఫలితంగా ఈ రోజు ఆవిర్భవించింది. కార్మిక సంఘాల పోరాటాల స్ఫూర్తితో, 1889లో మే 1ని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రకటించారు.19వ శతాబ్దంలో కార్మికులు రోజుకు 12-16 గంటలు పని చేయాల్సి వచ్చేది. దీనికి వ్యతిరేకంగా అమెరికా ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ 1884లో 1886 మే 1 నాటికి 8 గంటల పని దినాన్ని అమలు చేయాలని డిమాండ్ చేసింది.హేమార్కెట్ సంఘటన (1886): 1886 మే 1న లక్షలాది మంది అమెరికా కార్మికులు సమ్మె చేశారు. మే 4న షికాగోలోని హేమార్కెట్ స్క్వేర్‌లో జరిగిన ప్రదర్శనలో బాంబు పేలుడు, పోలీసుల కాల్పుల వల్ల కొందరు కార్మికులు, పోలీసులు మరణించారు.అంతర్జాతీయ గుర్తింపు: ఈ ఘటనలో మరణించిన వారి త్యాగాలను స్మరించుకుంటూ, 1889లో పారిస్‌లో జరిగిన సెకండ్ ఇంటర్నేషనల్ సమావేశంలో ప్రతి ఏటా మే 1న కార్మిక దినోత్సవం జరపాలని నిర్ణయించారు.భారతదేశంలో మొదటిసారిగా 1923, మే 1న మద్రాసులో హిందుస్థాన్ లేబర్ కిసాన్ పార్టీ నేతృత్వంలో మేడే వేడుకలు జరిగాయి.