


మన న్యూస్ ,నిజాంసాగర్,జుక్కల్, నిజాంసాగర్ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం సామూహిక మధ్యవర్తిత్వ కేంద్రాన్ని లోక్ అదాలత్ లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్ రెడ్డి,పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్,ఎస్ ఐ శివకుమార్ లు కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా పరిష్కారం కానీ కేసులను కూడా లోక్ అదాలత్ లో ఉచితంగా పరిష్కారం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, రవీందర్ రెడ్డి, ఎంపీడీవో గంగాధర్,తదితరులు ఉన్నారు.