ప్రవీణ్ పగడాల మృతి దర్యాప్తుపై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం..

  • ప్రవీణ్ పగడాల మృతి పై విచారణ వేగవంతం చేయాలి..
  • కేసు దర్యాప్తుపై కూటమి ప్రభుత్వంపై విరిసికుపడ్డ క్రైస్తవ పెద్దలు..
  • శంఖవరం కత్తిపూడి గ్రామంలో శాంతియుత ర్యాలీ…

మన న్యూస్ శంఖవరం (అపురూప్)

ప్రవీణ్ పగడాల మరణం మతపరమైన హత్యగా అనుమానిస్తూ క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రఖ్యాత క్రైస్తవ బోధకుడు పగడాల మార్చి 25న రాజమండ్రి సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పగడాల రోడ్డు ప్రమాదంలో పాల్గొన్నట్లు తేలింది. అయితే, క్రైస్తవ సంఘాలు దీనిని మతపరమైన ద్వేషపూరిత నేరంగా అనుమానించడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని అనుమానాలను తొలగించడానికి విస్తృత దర్యాప్తునకు ఆదేశించారు.
మార్చి 24 రాత్రి, ప్రవీణ్ కొవ్వూరులోని ఒక చర్చిలో జరిగిన కార్యక్రమానికి హాజరై, తరువాత తన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిల్‌పై రాజమండ్రికి బయలుదేరాడు. ఆశ్చర్యకరంగా, మరుసటి రోజు తెల్లవారుజామున రాజమండ్రి సమీపంలోని కొండమూరు వద్ద అతని మోటార్‌సైకిల్ పక్కన రోడ్డు పక్కన అతని మృతదేహం కనిపించింది.
పగడాలకు మతపరమైన సంస్థల నుండి హత్య బెదిరింపులు వస్తున్నాయని క్రైస్తవ సంఘాలు ఆరోపించడంతో ఈ మరణం రాజకీయ వివాదానికి దారితీసింది. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సంసాలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల మరణం వెనక మిస్టరీ నేటికీ వీడలేదు ఘటన జరిగి వారం రోజులు గడిచిన రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది హైదరాబాదు నుంచి విజయవాడ మీదగా రాజమహేంద్ర వరానికి బుల్లెట్ బైక్ పై వస్తున్న ప్రవీణ్ గత సోమవారం అర్ధరాత్రి దాటాక అనుమానస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే… పోలీసులు ఆ రోజు నుంచి ఇది రోడ్డు ప్రమాదమని పదేపదే చెబుతుండగా పోలీసులు వాదనతో క్రైస్తవ సమాజం తీవ్రంగా విభేదిస్తుంది. ఇది ముమ్మాటికీ ఆత్యానని దీని వెనుక ఉన్న కుట్రను బయటపెట్టాలని క్రైస్తవ సంఘాలు ఘటన జరిగిన నాటి నుంచి డిమాండ్ చేస్తున్నాయి ప్రవీణ్ మరణం పై క్రైస్తవ సంఘాలు సంధిస్తున్న అనేక ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి నిర్దిష్టమైన సమాధానం రాకపోవడంతో అనుమానాలకు మరింత బలం చేకూరుతుంది ప్రవీణును పథకం ప్రకారమే అంతమొందించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే దిశగా దర్యాప్తు జరుగుతుందనే అనుమానాన్ని క్రైస్తవ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు క్రైస్తవ సంఘాలు ఏకతాటిపైకి వచ్చేందుకు సమాయత్తమవుతున్నాయి.

శంఖవరం కత్తిపూడి గ్రామంలో శాంతి ర్యాలీలు…

ప్రవీణ్ పగడాల మరణం వెనక వాస్తవాలను బయటపెట్టాలని కోరుతూ శనివారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి లో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
మండలంలో గల క్రైస్తవ పాస్టర్లు మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల ముత్తుపై కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అత్యాయనని నిర్ధారణ చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం పై దర్యాప్తు నిర్లక్ష్యం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రగడాల ప్రభుత్వం సామర్ధ్యమైన దర్యాప్తు చేయాలని, పాస్టర్లకు క్రైస్తవ సమాజానికి క్రైస్తవ మందిరాలకు భద్రత కల్పించాలని, డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సంఘాల పెద్దలు ఎమ్. మోహన్, ఎమ్ భాస్కర రావు (మాస్టర్) మడికి ప్రకాష్, దడాల యాకోబు, శంఖవరం మండలం అధ్యక్షులు ఎలీషా, కార్యదర్శి పి.టి. పౌల్, టి. జోషాప్, నెహెమ్యా, చుక్క దాసు, డి. జాన్సన్, అపురూప్, కె మారేష్, ఎస్.సమర్పనరావు, కె మాణిక్యం, సిహెచ్ ఆమోష్, బి. దావీదు, పి .కృపరావు, ఎ .యేసురాజు కె శామ్యూల్, పి.సమూయేల్ రాజు, సుభాకర్,లజరేస్, పి. సత్యానందము, నానీబాబు జి. కొండల రావు, గాతాడ జాన్, తిరగటి సతీష్, భారీ సంఖ్యలో క్రైస్తవ సంఘాల సభ్యులు యువత యువతీలు పాల్గొన్నారు.

  • Related Posts

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    చిత్తూరు,మన ధ్యాస, అక్టోబర్ 29ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులను నిర్వర్తించడానికి అనువైన కార్యస్థానం అవసరమని, జిల్లా సచివాలయం నుండి వర్చువల్ విధానంలో సమీక్షలు నిర్వహించడానికి, పరిస్థితులను పరిశీలించడానికి అనువుగా ప్రస్తుతం ఉన్న వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను…

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    మన ధ్యాస ,వెంకటాచలం, అక్టోబర్ 29:సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల కేంద్రంలోని జగనన్న లేఔట్ ను పరిశీలించి,భారీ వర్షాల కారణంగా కాలని వాసులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత. కాలనీవాసులకు బ్రెడ్లు,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    భారీ వర్షాలకు కుప్పకూలిన రేకుల ఇల్లు..బోరున విలపిస్తున్న బాధ్యులు..ఘటన స్థలాలను పరిశీలించిన మండల స్థాయి అధికారులు..!!

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జిల్లా సచివాలయంలో పునరుద్ధరించిన వీడియో కాన్ఫరెన్స్ హాల్, కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    జగనన్న కాలనీలో పర్యటించిన కాకాణి పూజిత”

    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    • By JALAIAH
    • October 29, 2025
    • 4 views
    సోమరాజుపల్లి, టిపి నగర్ వరద బాధితులకు ఆహార పంపిణీ

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    అల్యూమినియం ఉత్పత్తిలోA1 ఆధారిత మిషన్ హీయరింగ్ మరియు విజన్ టెక్నాలజీలను పరిచయం చేసింది

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!

    వింజమూరు మండలంలో తుఫాన్ ప్రభావానికి నిండిన 17 చెరువులు..!