

మనన్యూస్,తిరుపతి:దుబాయిలో ఇటీవల మూడు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ ఉమెన్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సమ్మిట్ లో తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ భువన్ కుమార్ రెడ్డి కుమార్తె పి కృత్తికా రెడ్డి పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోకోకోలా, మైక్రోసాఫ్ట్, అన్ లివర్, డెలాయిట్ వంటి కంపెనీలతోపాటు ఇతర కంపెనీల సీఈఓ లతో వ్యాపారాల అభివృద్ధి, సక్సెస్ సాధించడం వంటి అంశాలపై కృత్తికా రెడ్డి సమావేశంలో సుదీర్ఘంగా వివరించారు. సమ్మిట్ కు హాజరైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు కంపెనీల సీఈఓ లు కృత్తికా రెడ్డి ఉపన్యాసానానికి మంత్రముగ్ధులయ్యారు. అక్కడికి వచ్చిన సీఈవోలు ప్రత్యేకంగా అభినందించారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల తరఫున కృత్తికా రెడ్డి ఒక్కరే హాజరు కావడం రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం. ఈమె తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ లో పదో తరగతి వరకు చదువుకున్నారు. హైదరాబాద్ లోని బిట్స్ పిలానిలో కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎస్పీ జైన్ గ్లోబల్ మేనేజ్మెంట్, దుబాయిలో ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు. ఏది ఏమైనా రెండు తెలుగు రాష్ట్రాలలో తిరుపతికి చెందిన యువతి కృత్తికా రెడ్డి ప్రపంచవ్యాప్త కంపెనీల సిఈఓ ల సమిట్ లో పాల్గొని ప్రసంగించడం ఎంతో అభినందనీయమని తెలుగు రాష్ట్రాలకు చెందిన మేధావులు శాస్త్రవేత్తలు, విద్యావంతులు ప్రశంసలతో ముంచెత్తారు.
