

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్)
పట్టణంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల పాస్టర్ ఫెలోషిప్,సెయింట్ ఫాల్స్ లూథరన్ చర్చ్ మండల పాస్టర్స్ ఆధ్వర్యంలో గురువారం శాంతియుత ర్యాలీ చేపట్టారు.తొలుత తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి బాలాజీ చౌక్ సెంటర్లో మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్స్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, జరిగిన ఘటనపై ప్రభుత్వం న్యాయవిచారణ చేపట్టాలన్నారు. ప్రవీణ్ పగడాల మృతిని రోజురోజుకు పలు రకాలుగా సామాజిక మాధ్యమాలలో చూపిస్తున్నారని, అలా చూపించడం వల్ల క్రైస్తవులు మనోవేదనకు గురవుతున్నారు అన్నారు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల మృతి పై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్స్ లూథరన్, పట్టణ మండల అధ్యక్షులు,కే ప్రశాంత్ కుమార్, కే సుదర్శన్ డేవిడ్ రాజ్,
వి.వత్సలరావు,బి.సుమలత,కే.రవికుమార్,ఎం.సుజాత,ఎం.త్రిమూర్తులు,కుంపట్ల పాల్ ప్రసాద్,జే.రాజు,కే మోహన్ రావు,సి ఆర్,పట్టణ మండల పాస్టర్స్,సంఘ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.