

వైద్య అధికారులకు దిశా నిర్దేశం, అవసరమైన సదుపాయాలను గుర్తించి నివేదిక అందించాలని ఆదేశం..!
మనన్యూస్,వింజమూరు:వింజమూరు లోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ మంగళవారం పరిశీలించారు. ఈనెల 4 గానీ ఐదో తేదీ గాని డయాలసిస్ సెంటర్ ను ఆరోగ్య శాఖ మంత్రి శ్రీసత్య కుమార్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. నూతనంగా జనరేటర్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిడిఓ డాక్టర్ కార్తీక్ తో మాట్లాడుతూ మంత్రి వస్తున్న సందర్భంగా ఏర్పాట్లను చక్కగా చేయాలన్నారు. కొరతగా ఉన్న డాక్టర్లు సిబ్బందిని నియమించుకునేందుకు నివేదిక తయారు చేయాలన్నారు. అదేవిధంగా అవసరమైన సదుపాయాలను కూడా మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని తెలియజేశారు. జిల్లా ఆరోగ్య శాఖ అధికారి తో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి లోటు పాట్లు లేకుండా ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు స్థానిక నాయకులు సిబ్బంది తదితరులు ఉన్నారు.
