

మనన్యూస్,నెల్లూరు:రూరల్ లో జరుగుతున్న 303 అధివృధి పనుల పురోగతిపై మంగళవారం 9 గంటలకు ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్షేత్రస్థాయి అధికారుల వద్ద నుంచి ఉన్నతస్థాయి అధికారుల దాకా, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి స్థానిక నాయకుల దాకా అందరితో ఫోన్ లో సమీక్షించారు.ఇప్పటికే 91 పనులు పూర్తయినట్లు 139 పనులు సాగుతున్నట్లు 73 పనులు ఇంకా ప్రారంభం కానట్లు గుర్తించారు. పనులు పూర్తి చేసిన, నిర్మాణ దశలో ఉన్న అధికారులను, కాంట్రాక్టర్ల లను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభినందించారు.ఇంకా ప్రారంభించని 73 పనులు 48 గంటల్లో ప్రారంభించి తీరాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడవద్దని, మరో 3 రోజుల్లో మళ్ళీ 2వ సారి తానే స్వయంగా లేబరేటరీకి వెళ్తానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేసారు.
