

మనన్యూస్,కాకినాడ:పగడాల ప్రవీణ్ మృతి తో క్రైస్తవ ఆరాధకుల్లో ఏర్పడిన అశాంతి పట్ల భారత సమాజం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నదని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. క్రైస్తవ సంఘాలు భానుగుడి జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీకి సంఘీభావం ప్రకటించా రు.కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన మహాజన సభలో మాట్లాడుతూ మతోన్మాదం వలన సమాజం అస్థిరత చెందుతుందన్నారు. ప్రవీణ్ మృతి చెందిన విషయం తెలిసిన క్షణం నుండి సర్వత్రా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు అనుమానాలు సందేహాలు వున్నందున వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌధ్ధ మతాలు వేరైనా జాతీయ సమగ్రతను పాటించే ఆదర్శ ధర్మం ఒక్కటేనన్న సత్యం గమనార్హమన్నారు. సత్య మేవ జయతే గా నినదించారు. ఎవరు ఏ దైవాన్ని ఏ మతాన్ని ఆరాధించినా మత విద్వేషం కూడదన్నారు. మానవత్వం తోనే మతాల నడుమ జాతీయ సమగ్రత సాధ్యమన్నారు. దుష్కర్యాలతో మతాల నడుమ చిచ్చు పెట్టే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా ఉండాలన్నారు. శిక్షించడానికి వాస్తవాలు బహిరంగం చేయడానికి వెనుకాడకూడదన్నారు.
