న్యాయం చేయండంటూ పోలీస్ స్టేషన్ ఎదుట గిరిజన మహిళ అవేదన

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్): ఏలేశ్వరం మండలం కంబాలపాలెం గ్రామానికి చెందిన సిరుబోతుల రామకృష్ణపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు కేసు బనాయించి ఈ నెల 15వ తేదీ నుండి ప్రతీ రోజు పిలిపించి చేయని పనిని ఒప్పుకోమంటూ తనభర్తను చిత్ర హింసలకు గురిచేసారంటూ బాధితుడి భార్య లక్ష్మి పార్వతి ఆవేదన వ్యక్తం చేస్తూ బోరున విలపించారు.ఈ నెల 26వ తేదీ నుండి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఉషారాణి,ఆమె భర్త వారి అనుచరులు నా భర్తను కనపడనివ్వకుండా చేశారని ఆరోపించింది.దీనిపై తన భర్త ఎక్కడ వున్నాడో తెలియక ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఈ నెల 28 న హెబియస్ కార్పస్ పిటిషన్,(8394/2025) దాఖలు చేసింది.దీనిపై ఫారెస్ట్ అధికారికి హైకోర్టు నుండి ఫారెస్ట్ రెంజర్ ఉషారాణికి,పోలీసులకు బాధితుడును వచ్చేనెల 1వ తేదీన హైకోర్టుకు హాజరుపరచాలని నోటీసులు జారీ చేశారని తెలిపింది.దీనిపై ఈ నెల 28న అనగా శుక్రవారము సాయంత్రం 5,6 గంటల ప్రాంతంలో హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేశామని కక్షతో పరిమితడకలో మా వద్దకు రేంజర్ ఉషారాణి తమ భర్త మరియు సిబ్బంది వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురిచేసారని బాధితుడి భార్య లక్ష్మీపార్వతి తెలిపింది.నా భర్తను వదలాలంటే నన్ను ఖాళీ పేపర్ పై సంతకం చేయమని బలవంతంగా సంతకం పెట్టించుకున్నారని తెలిపింది.నాకు నమ్మకం తోచక ఏలేశ్వరం పోలీసు స్టేషన్ కు నిన్నటి రాత్రి వచ్చామని,ఎస్టీ మహిళనైన నన్ను అర్ధరాత్రి రెండు గంటల వరకు స్టేషన్లోని పడికాపులు కాచానని ఆవేదన వ్యక్తం చేసింది.తమకు న్యాయం చేయాలని నా భర్తను నా దగ్గరికి పంపించాలని ఈ సందర్భంగా మీడియా ముఖంగా తాను మాట్లాడలేని స్థితిలో ఉండటం చేత బాధిత మహిళ చెల్లి మీడియాతో వ్యక్తపరిచింది

  • Related Posts

    కర్ణాటక రాష్ట్ర గవర్నర్ నుండి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్న కావలి వాసి “కావ్య”

    మన న్యూస్, కావలి ,మే 17:నెల్లూరు జిల్లా కావలికి చెందిన కుమారి తొట్టెంపూడి కావ్య శుక్రవారం బెంగుళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ( గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర ) నుండి డాక్టరేట్ అందుకున్నారు. అదే విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కావ్య,…

    ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…

    శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యమని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరకూల సత్య ప్రభ అన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కొంతంగి గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కర్ణాటక రాష్ట్ర గవర్నర్ నుండి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్న కావలి వాసి “కావ్య”

    కర్ణాటక రాష్ట్ర గవర్నర్ నుండి వ్యవసాయ శాస్త్రంలో డాక్టరేట్ అందుకున్న కావలి వాసి “కావ్య”

    అమృత పథకం అవినీతిపై దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా………. కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి

    అమృత పథకం అవినీతిపై దమ్ముంటే మాజీ ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా………. కావలి ఎమ్మెల్యే దగు మాటి వెంకటకృష్ణారెడ్డి

    ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…

    ఉన్నతమైన లక్ష్యాలను చేరాలంటే విద్య ప్రాముఖ్యం…

    అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…

    అక్రమ తొలగింపుకు గురైన పద్మకు న్యాయం చేయాలి…

    ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

    ఘనంగా సాయి చందు – ధరణి వివాహ మహోత్సవం వధూవరులను ఆశీర్వదించిన పలువురు నాయకులు

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ…