గ్రామాలలో పారిశుద్ధ్యం మెరుగుకై ట్రాక్టర్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్.

మనన్యూస్,వింజమూరు:స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ భారత్ నిధుల నుండి చాకలి కొండ మరియు కాటేపల్లి పంచాయతీలకు మంజూరైన రెండు ట్రాక్టర్లను ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు మరియు కార్యదర్శులకు, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి సమక్షంలో పంపిణీ చేశారు.ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన ట్రాక్టర్లను ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ శ్రీమతి ప్రవీణ దంపతులు టాక్టర్ పైకి ఎక్కి నడిపారు. అనంతరం శ్రీమతి కాకర్ల ప్రవీణ, సర్పంచ్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్యం మెరుగుకై సుమారు 12 లక్షల రూపాయల విలువ కలిగిన ట్రాక్టర్లను పంపిణీ చేయడం జరిగింది అన్నారు. వీటిని వినియోగించుకొని గ్రామాలలో పారిశుద్ధ్యన్ని మెరుగుపరిచి స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. టాక్టర్ల ద్వారా సేకరించిన చెత్తను సంపద కేంద్రాలకు తరలించి సంపద సృష్టించాలని తెలిపారు. ఇంతకాలం వాహనం లేని ఈ రెండు పంచాయతీలకు వాహనాలు రావడం పట్ల గ్రామ సర్పంచులు నాయకులు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో చాకలి కొండ సర్పంచ్ కుమారి ఉప్పి రెట్ల సుబ్బలక్ష్మి కుమారి డాక్టర్ వెంకటేశ్వర్లు పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య వింజమూరు మండల కన్వీనర్ గొంగటి రఘునాథరెడ్డి జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు యాదవ్ కొండాపురం మాజీ జడ్పిటిసి సభ్యులు దామా మహేష్ టెలిఫోన్ అడ్వైజర్ కమిటీ డైరెక్టర్ తాటికొండ అనూష కాటేపల్లి సర్పంచ్ ముప్పూరి విజయ లక్ష్మమ్మ లెక్కల వెంగళరెడ్డి దిండు నారాయణ ఉప సర్పంచ్ నాగేంద్రబాబు కేశవ నారాయణ దిండు కిరణ్ దిండు వెంకటేష్ కార్యదర్శులు శేఖర్ షరీఫ్ తదితరులు ఉన్నారు.

  • Related Posts

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస ,ఇందుకూరుపేట ,సెప్టెంబర్ 12:. జగదేవి పేటలో 50 లక్షలతో సిసి రోడ్ల ప్రారంభోత్సవం. – మరో 50 లక్షల నుడా నిధులతో డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం .అభివృద్ధి, సంక్షేమం ఏకకాలంలో అమలు చేసే పాలనా దక్షత ముఖ్యమంత్రి చంద్రబాబు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    శంఖవరం/ రౌతులపూడి మన ధ్యాస ప్రతినిధి (అపురూప్):-కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గంగవరం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబాన్ని గుర్తించి మేమున్నాం అంటూ గంగవరం గ్రామ ఆడపడుచులు ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఇంకా మానవత్వం బతికే ఉన్నాది అనేదానికి ఈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా ఆంధ్రప్రదేశ్ సమాచార మరియు ప్రజా సంబంధాల (ఐ అండ్ పి ఆర్) శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్లా

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..

    గిరిజన ప్రాంతంలో నల్ల రోడ్డు మీద పచ్చ బస్సు ప్రారంభం..