

మనన్యూస్,నెల్లూరు:సిటీ,జనసేన ఎనిమిదో డివిజన్ నాయకులు గుర్రం కిషోర్ మరియు కళ్యాణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్ఎస్ఆర్ స్కూల్ ప్రాంగణంలో ప్రజలకు దాహార్తిని తీర్చే విధంగా చలివేంద్రం ఏర్పాటు చేశారు.
మొదటి రోజు పదవ క్లాస్ పరీక్షలు రాసి వస్తున్న విద్యార్థులకు శీతల పాననయాలని అందించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.8వ డివిజన్ నాయకులు గుర్రం కిషోర్,కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆర్ ఎస్ ఆర్ స్కూల్ నందు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేసి మొదటి రోజు శీతల పానీయాలను అందిస్తున్న మా నాయకులకు అభినందనలు కార్యకర్తలు తెలియజేశారు.
ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన జనసేన పార్టీ ప్రజల మన్ననలు పొందింది.రానున్న రోజుల్లో కార్పొరేషన్ లిమిట్ లో మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని తెలిపారు.
