

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం: ఏలేశ్వరం మండల శ్రీ సత్య దేవా టెంట్ హౌస్ వర్తక వ్యాపారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నిక బుధవారం ఏకగ్రీవం అయింది.శ్రీ సత్య దేవా టెంట్ హౌస్ వర్తక వ్యాపారుల సంఘం నూతన అధ్యక్షుడిగా గూడవల్లి అర్జునరావు, కార్యదర్శిగా గూడుపు కృష్ణ, ఉపాధ్యక్షుడిగా కోన బాబు, ట్రెజరర్ గా బస దుర్గాప్రసాద్,జాయింట్ కార్యదర్శిగా జి కృష్ణమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గూడవల్లి అర్జున్ రావు మాట్లాడుతూ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందని,టెంట్ హౌస్ వర్తక వ్యాపారులకు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను సంఘ సభ్యులకు లబ్ధి పొందేలా తనవంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టెంట్ హౌస్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.