

ప్రకృతి వ్యవసాయo పై అవగహన సదస్సు
మనన్యూస్,శంఖవరం,అపురూప్:ప్రకృతి వ్యవసాయoలో భాగంగా ఖరీఫ్ 2025 కార్యాచరణ ప్రణాళిక వ్యవసాయ అనుబంధ శాఖలు, డీ ఆర్ డీ ఏ,ఎన్ ఆర్ జి ఎస్ సమన్వయంతో పని చేసి తయారు చేయాలి అని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ ఎలియజర్ సూచించారు.శంఖవరం మండల అభివృద్ధి సమావేశ మందిరంలో మండలంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది,రైతు సేవా కేంద్ర సిబ్బంది,వెలుగు సిబ్బందితో సమావేశం నిర్వహించి సిబ్బంది గ్రామాల్లో పర్యటించి రైతులతో చర్చించి ఆయా గ్రామాల పరిస్థితి,పంటల పరిస్థితికి అనుగుణంగా పంటల ప్రణాళిక తయారు చేయాలని వివరించారు. పెరటి తోటల పెంపకం,మిద్దె వ్యవసాయం,నవధాన్యాలు సాగు వంటి అంశాలపై వ్యవసాయ అధికారి పి గాంధీ సిబ్బందికి అవగాహన కల్పించారు. మిశ్రమ వ్యవసాయంలో భాగంగా ఎన్ ఆర్ ఈ జి ఎస్ సహకారంతో ఫాం పాండ్స్ తవ్వుటకు అర్హులైన రైతుల వివరాలు అందజేయాలని ఎం డీ ఓ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఎ పి ఎం ,మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, ఏ ఈ ఓ శ్రీనివాస్,మౌళి ప్రసాద్, ప్రక్రుతి వ్యవసాయ సిబ్బంది సోమరాజు,వర లక్మి,రైతు సేవా కేంద్ర సిబ్బంది,మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.
