

మనన్యూస్,నెల్లూరు:రంగనాయకుల పేట లో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలతో కలిసి పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.అనంతరం 52 డివిజన్ ఇన్ చార్జ్ మహబూబ్ బాషా నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ఇఫ్తార్ విందును స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసి చైర్మన్ పెర్నెటి కోటేశ్వర రెడ్డి, డివిజన్ కోఆర్డినేటర్ కందుకూరు రమేష్, ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
