మనన్యూస్,సర్వేపల్లి:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా,సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, పేడూరు గ్రామంలో ఆదివారం ఉదయం పర్యటించిన మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ….ధాన్యం అమ్మకాలలో గిట్టుబాటు ధర రాక, విపరీతంగా నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నామంటూ, రైతుల ఆవేదన చెందుతున్నారు అని అన్నారు.గ్రామంలో మట్టి రోడ్డు కనిపించకుండా సంపూర్ణంగా సిమెంటు రోడ్లు నిర్మించారని కాకాణిని ప్రశంసించిన పేడూరు గ్రామస్తులు.
పేడూరు గ్రామ ప్రధాన రహదారికి సిమెంట్ రోడ్డు నిర్మించి, దశాబ్దాల సమస్యను పరిష్కరించారంటూ, మాజీ మంత్రి కాకాణికి ధన్యవాదాలు తెలియజేసిన స్థానికులు.కూటమిపాలనలో అభివృద్ధి, సంక్షేమం కనుమరుగయ్యాయని ప్రజలంతా, తిరిగి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తున్నారని పేర్కొన్న ప్రజలు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు శ్యాంసన్ పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన కాకాణి గోవర్ధన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంలో రైతులు నిలువునా దోపిడీకి గురవుతున్నారు.ధాన్యం రేట్లు రోజురోజుకీ పడిపోతున్న ,అధికారులకు ప్రజాప్రతినిధులకు చీమ కుట్టినట్లయినా లేదు అని అన్నారు.సోమిరెడ్డి రైతులను వదిలేసి, దళారులను వెంటపెట్టుకొని ధాన్యం పరిశీలనకు వెళ్లుతున్నాడు. రైతులు ధాన్యం అమ్ముకోలేక గిట్టుబాటు ధర దక్కక నానా అవస్థలు పడుతుంటే, అధికారులు విస్తృతంగా కొనుగోలు చేపట్టామని చెప్పడం, రైతులకు పుండు మీద కారం చల్లినట్లుంది అని అన్నారు.
కూటమి ప్రభుత్వం తమను ఆదుకునే పరిస్థితిలో లేదని, రైతులు కూడా నిర్ధారణకు వచ్చేశారు అని తెలిపారు.
ధాన్యం అమ్మకాలలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అధికారులు దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువస్తున్నా, స్పందన శూన్యం అని అన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రైతులను అన్ని విధాలా ఆదుకుంటే, చంద్రబాబు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడంటూ, రైతులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
సోమిరెడ్డి డ్రామాలతో రైతులకు మరింత నష్టం వాటిల్లడం తప్ప, ఏమాత్రం పరిస్థితి మెరుగుపడటం లేదు.పేడూరు గ్రామంలోని ప్రధాన రహదారిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లో,మూడు కోట్ల రూపాయలు వెచ్చించి, శాశ్వతంగా సిమెంట్ రోడ్డు నిర్మించాం.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాకపూర్వం గ్రామంలో ఎప్పుడు నీరు నిలువ ఉండి, మురికి కూపంలా మారి, అంటువ్యాధులు ప్రబలుతున్నా, పేడూరు గ్రామ ప్రధాన రహదారిని పట్టించుకున్న పాపాన పోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నేను మంత్రిగా మూడు కోట్లకు పైగా వెచ్చించి, పేడూరు గ్రామానికి సిమెంటు రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించి, గ్రామస్తులు అవస్థలు పడకుండా, చర్యలు తీసుకున్నాం అని అన్నారు. కొలిదిబ్బ గిరిజన కాలనీకి 2019 ఎన్నికలకు ముందు రోడ్డు మంజూరు చేశామని శిలాఫలకం వేసి పలాయనం చిత్తగిస్తే, నిధులిచ్చి, గిరిజన గ్రామానికి సిమెంట్ రోడ్డు వేయించాం అని అన్నారు. గ్రామాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప, కూటమిపాలనలో అభివృద్ధి జాడే కనిపించడం లేదు అన్నారు.
చంద్రబాబు ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చి, ఓట్లు దండుకొని, ప్రజలను నిట్ట నిలువునా మోసం చేశాడు అని అన్నారు.ప్రజలు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం.. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, విధ్వంసాలు బేరీజు వేసుకొని జగన్మోహన్ రెడ్డి మరలా తిరిగి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అని తెలియజేశారు.
ధాన్యం అమ్మకాలు పూర్తవుతున్నా, కొనుగోలు చేపట్టకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టే విధంగా ఒత్తిడి పెంచుతాం అని తెలిపారు.
ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ ఏ అవసరం వచ్చినా సత్వరమే స్పందిస్తూ, సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తాం అని అన్నారు.
