Mana News :- పినపాక నియోజకవర్గం ప్రతినిధి, మన న్యూస్, నవంబర్, 12, 2024 :- ఏడూళ్ళ బయ్యారం రేంజ్ పరిధిలోని కరకగూడెం గ్రామం మండల కేంద్రంలో గల తుమ్మలగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు కలప, కిటికీలను విశ్వాసనీయ సమాచార మేరకు సెక్షన్ ఆఫీసర్ గోవింద్,బిట్ ఆఫీసర్ రోజా ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించగా ఒక ఇంట్లో నిల్వ ఉన్న కిటికీలు కలపను స్వాధీన పరుచుకొని ఏడూళ్ళ బయ్యారం రేంజ్ ఆఫీస్ కి తరలించారు. వీటి విలువ సుమారు రెండు లక్షల వరకు ఉంటుందని సెక్షన్ ఆఫీసర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ ఆఫీసర్లు కొండలరావు, సూరయ్య ,బీట్ ఆఫీసర్ రాంబాబు, బేస్ క్యాంప్ సిబ్బంది రాంబాబు, గణేష్, సాంబశివరావు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *