మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ):- మహమ్మద్ నగర్ మండలంలోని కొమలంచ గ్రామ కొనుగోలు కేంద్రం నుంచి వెళ్లిన ధ్యానం లారీలు రైస్ మిల్లు వద్ద ఆగిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.ధ్యానం లారీలు ఆగిపోకుండా ఉండాలంటే కోమలంచ గేటు వద్ద బాన్సువాడ-నిజాంసాగర్ ప్రధాని రహదారిపై ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి,తహసీల్దార్ సవాయిసింగ్,మండల వ్యవసాయ అధికారి నవ్య, స్థానిక ఎస్సై సుధాకర్ కొనుగోలు కేంద్రానికి చేరుకుని రైతులతో మాట్లాడారు అనంతరం రైస్ మిల్లు యజమానులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా చేయడం విరమించుకున్నారు.ఈ కార్యక్రమంలో గున్కుల్ సొసైటీ వాజిద్, సొసైటీ కార్యదర్శి రాములు, కాంగ్రెస్ నాయకులు నాగభూషణం గౌడ్,ఖాలీక్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *