Oplus_131072

మన న్యూస్,నిజాంసాగర్, జుక్కల్, నియోజకవర్గ అభివృద్ధి కొరకు అధికారులు సమన్వయంతో పని చేయాలి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావు అన్నారు.
జుక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో పని చేసే అన్ని శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..అభివృద్ధికి సంబంధించి శంకుస్థాపనల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదన్నారు.నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని అందుకు క్షేత్రస్థాయిలో పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిందిగా అధికారులకు సూచించారు.
ఈ విషయంలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తన దృష్టికి తీసుకురావాలని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లు బిక్షపతి,సవైయి సీంగ్,ముజీబ్,తదితరులు ఉన్నారు.

By RAHEEM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *