స్పందించిన జడ్జి _ మతి స్థిమితం లేని యువతికి వైద్యం

మనన్యూస్,కాకినాడ:సుమారు పది రోజుల నుంచి కాకినాడ నగరంలో మతిస్థిమితం లేక శరీరంపై సగం దుస్తులు కప్పుకుని తిరుగుతున్న యువతికి మానవీయ కోణంలో ఒక జడ్జి స్పందించగా ఆమె ఆదేశాలతో వైద్యం అందుతోంది. పైగా ఆ మతిస్థిమితం లేని యువతికి జడ్జి సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందించడమే కాక మామూలు స్థితికి వచ్చే పరిస్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, మూడవ అదనపు జిల్లా కోర్టు జడ్జి పి కమలాదేవి బుధవారం కోర్టు ప్రాంగణంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు రోజుల క్రితం తాను బయటకు వస్తుండగా మతిస్థిమితం లేక ఒంటిపై సగం దుస్తులు కప్పుకొని అక్కడక్కడ తిరుగుతున్న యువతిని చూచానని దీంతో ఆమె ఆచూకీ గమనించాలని తమ సిబ్బందితో పాటు పోలీసులకు తెలియజేశానన్నారు. ఆమె సుమారు పది రోజుల నుంచి కాకినాడ నగర ప్రాంతాల్లో ఈ విధంగా తిరుగుతుందని పోలీసులు బదులివ్వడంతో తాను ఆశ్చర్యానికి గురయ్యానన్నారు. ఈ విషయంపై ఆమెకు మానసిక వైద్యం అందివ్వాలని వైద్యులు దిశ వన్ స్టాప్ సిబ్బంది తెలియడంతో తాను ప్రత్యేకంగా రిసెప్షన్ అనే ఆర్డర్ నిచ్చానని దీంతో ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ఆమె వివరాలు కొద్దిగా తెలుసుకున్నామని కమలాదేవి చెప్పారు. ఆ యువతి కాకినాడ నగరానికి చెందినట్లుగాను వైద్య విద్య చదివినట్లుగా విచారణలో తేలిందన్నారు. త్వరలోనే ఆ యువతిని పూర్తి వివరాల సేకరించిన పిమ్మట వారి ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఈ విధంగా మతిస్థిమితం లేక ఎంతోమంది యువతులు దుస్తులు లేకుండా తిరిగేవారు ఉన్నారని వారి పట్ల ఎంతో దయగా వ్యవహరించాలని వీరి కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలను ఉపయోగించుకుని అండగా నిలవాలని కమలాదేవి హితవు పలికారు.

  • Related Posts

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    సూపర్ సిక్స్ విజయోత్సవ వేదికగా ఆటో డ్రైవర్లకు  కానుక దసరాకు ఆటో డ్రైవర్లకు రూ.15వేల ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించిన సీఎం రప్పారప్పా అంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక వైసీపీ నాయకుడిది దృతరాష్ట్ర కౌగిలి అని ఎద్దేవా చేసిన ముఖ్యమంత్రి  సీమ…

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉరవకొండ మన ధ్యాస: వజ్రకరూరు మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం క్లైమేట్ కేర్ ఛాంపియన్స్ ప్రోగ్రాం (స్వస్తి ) బృందం తనిఖీ చేశారు. శివ కిషోర్ స్టేట్ ప్రోగ్రాం మేనేజర్, డాక్టర్ తన్మయి మేనేజర్ వేదిక అసోసియేట్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 1 views
    దళితుల స్థలాలను ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి కొప్పాల రఘు…వివాదాస్పదమైన జి చెర్లోపల్లి గ్రామాన్ని సందర్శించిన డివిఎంసి సభ్యులు…///

    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్ సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    • By NAGARAJU
    • September 10, 2025
    • 3 views
    అనంతపురంలో ఘనంగా “సూపర్ సిక్స్  సూపర్ హిట్” సభ..సూపర్ సిక్స్- సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్…///

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఒన్ సైడ్ గా గెలిపించండి

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    ఎన్నికల్లో హామీలు ఇచ్చాం ఎన్ని కష్టాలు వచ్చినా తీర్చాం.

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    వాతావరణ మార్పుల ప్రభావం–ఆరోగ్య జాగ్రత్తలు తప్పనిసరి: శివ కిషోర్

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు

    ఉపరాష్ట్రపతి ఎన్నిక కేవలం వ్యక్తి ఎన్నిక కాదు