

మనన్యూస్,తిరుపతి:జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వ పెన్షనర్ల సంఘం విజ్ఞప్తిరాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని, పెండింగులో ఉన్న డిఏ బకాయిలు చెల్లించాలని, 2023 జూలై నుండి అమలు పరచాల్సిన 12వ పిఆర్సి కమిటీని నియమించాలని తదితర సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో జిల్లా కలెక్టర్లను కలిసి వినతపత్రాలు అందజే యడం జరిగింది. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ ను కలిసి తమ డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా పెన్షనర్ల సంఘం తిరుపతి జిల్లా సహాధ్యక్షులు టి.గోపాల్ మాట్లాడుతూ పెన్షనర్లకు 2023 జూలై నుండి అమలు పరచాల్సిన 12వ పిఆర్సి కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెండింగ్ లో ఉన్న డీఏలు చెల్లించేందుకు, 11వ పి ఆర్ సి లో ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లించాల్సిన పిఆర్సి అరియర్స్ బకాయిల కొరకు సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. రిటైర్డ్ అయిన పెన్షనర్లకు ఇంతవరకు చెల్లించకుండా పెండింగ్లోనున్న జిపిఎఫ్ పిఎఫ్ సొమ్ము, ఏపిజిఎల్ఐ ఫైనల్ పేమెంట్స్, గత సంవత్సరం సెప్టెంబర్ నుండి రిటైర్డ్ అయిన వేలాదిమంది పెన్షనర్లకు చెల్లించకుండా పెండింగ్లో ఉన్న గ్రాట్యుటీ చెల్లించడానికి కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం పెన్షన్లకు తగ్గించిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ తిరిగి యధా విధంగా 70 సంవత్సరాలు దాటిన వారికి 10 శాతం, 75 సంవత్సరాలు దాటిన వారికి 15 శాతం చెల్లించాలన్న తమ డిమాండ్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో గౌరవ కలెక్టర్ లను కలిసి సమస్యలను విన్నవిస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరామ నాయుడు, జిల్లా అధ్యక్షులు కేఆర్ శంకర్, సహాధ్యక్షులు టి.గోపాల్, నగర శాఖ ప్రధాన కార్యదర్శి సి. వెంకటేశం శెట్టి, తిరుపతి నగర శాఖ కార్యవర్గ సభ్యులు అల్లాబక్షు, ఈ కృష్ణమూర్తి, శేఖర్, జగన్నాథం నాయుడు, జయరాం, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
