పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి MLC గా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా కార్యకర్తలు సంబరాలు

మనన్యూస్,నెల్లూరు:కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి వేడుకలు నాయకులు, కార్యకర్తలు
నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైసీపీ సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అఖండ విజయం సాధించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు,మిత్రులు అభిమానులు, కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా కార్యకర్తలు బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు.నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రాకతో కార్యాలయం వైసీపీ నగర కిక్కిరిసింది.కార్యకర్తల సందడి తో.. పార్టీ పరిసర ప్రాంతాలన్ని కోలాహాలంగా మారాయి.
పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగి విద్యాసంస్థలు స్థాపించి నేడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అద్భుతమైన సేవలందిస్తున్నారని వారు తెలిపారు.ఎమ్మెల్సీగా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి గెలుపు ఒక చరిత్ర అని పేర్కొన్నారు.నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ గా పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సేవలందిస్తూ నెల్లూరు రెడ్ క్రాస్ కు దేశ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చారని తెలిపారు. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏ రంగంలో అడుగుపెట్టిన ఆ రంగానికి వన్నె తెచ్చే విధంగా ఆయన సేవలందిస్తున్నారని కొనియడారు. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సేవలను మెచ్చి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించారని తెలిపారు.సిటీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రజల పట్ల ఆయన చూపుతున్న ఆదరణకు ప్రజల్లో ఎనలేని అభిమానం సంపాదించుకున్నారని తెలిపారు .సిటీ ఇన్చార్జిగా ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సారధ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సంతరించుకోవడం ఖాయమని తెలిపారు.ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సారథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం దిశగా తామంతా పనిచేసి మళ్లీ ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసుకుంటామన్నారు.

  • Related Posts

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    మన ధ్యాస ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ఏలేశ్వరం మార్కెట్ సమీపంలో గల జుమా మసీదు కు సంబంధించిన పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని. శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుమా మసీదు డెవలప్మెంట్ కమిటీ…

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మన ధ్యాస,కోవూరు, సెప్టెంబర్ 12: అక్రమ లేఅవుట్లను ఆదిలోనే అడ్డుకునే విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి .కోవూరు నియోజకవర్గ పరిధిలో నుడా నిబంధనలు పాటించని అనధికార లే అవుట్ల యజమానులు 2025 అక్టోబర్ 30వ తేదీ లోపు అపరాధ రుసుం చెల్లించి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    జుమా మసీదు నూతన కమిటీ ఏన్నీక

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్ చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    అనధికారిక లేఔట్లను ఎల్.ఆర్.ఎస్ ద్వారా రెగ్యులైజ్  చేయించుకోండి…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    ప్రజల అవసరాలు గుర్తించి పరిపాలన చేసే మానవతావాది చంద్రబాబు నాయుడు………. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    మరోసారి మానవత్వం చాటుకున్న గంగవరం ఆడపడుచులు…

    అచ్చంనాయుడుది నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    అచ్చంనాయుడుది  నోరేనా ………మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు…….. షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి

    ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆటో డ్రైవర్లు పండుగ వాతావరణంలో ఉన్నారు……..  షేక్ అబ్దుల్ అజీజ్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి