

మనన్యూస్,గొల్లప్రోలు:ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగనిరతిని ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు స్వచ్ఛ గొల్లప్రోలు సభ్యులు పేర్కొన్నారు. గొల్లప్రోలు లోని గాంధీ నగర్ లో గల స్వామి వివేకానంద జ్ఞాన మందిరంలో ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి పొట్టి శ్రీరాములు అసువులు బాసారన్నారు. ఆయన ఆత్మార్పణ ఫలితంగానే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ త్యాగ నిరతిni అలవరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ గొల్లప్రోలు కన్వీనర్ కొశిరెడ్డి రాజా, సభ్యులు కర్రి కొండలరావు, కంకటాల వాసు, మలిరెడ్డి సత్యనారాయణ, కీర్తి ఆదినారాయణ, సారిపల్లి సూరిబాబు, మైనం రాజశేఖర్, మాజీ సైనికులు చేదులూరి సత్యనారాయణ, భారతాల శేషారావు తదితరులు పాల్గొన్నారు.
