

మన న్యూస్ : కామారెడ్డి జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యం లో అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ హాల్ లో కామారెడ్డి రెస్టారెంట్ యాజమానులతో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి Ms. టీ. నాగరాణి గారు సమావేశమైనారు. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం బాల కార్మికుల (Child Labour) నిర్ములన. ఈ సమావేశం లో ఆమె మాట్లాడుతూ చిన్న పిల్లలను పనిలో పెటుకోవద్దని ఆదేశించారు. ఎవరైనా బాల కార్మికులను పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు . ఆకస్మిక తనిఖీ చేస్తాం అని చెప్పారు . శుభ్రత పాటించాలి అని అన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న వారు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి గారు జూనియర్ అసిస్టెంట్ ఖాన్ , శ్రవణ్ , సాయిప్రణీత్. లేబర్ డిపార్ట్మెంట్ జూనియర్ అసిస్టెంట్ సతీష్ పాల్గొన్నారు
