

మనన్యూస్,నారాయణ పేట:పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల అవసర నిమిత్తం కొరకై ప్యాడ్లను వితరణ చేయడం జరిగిందని కూన్సి గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వామినాథ్ తెలిపారు. నారాయణపేట జిల్లా పరిధిలోని కృష్ణ మండలంలోని కున్సి గ్రామములో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్యాడ్ల వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి స్వామినాధ్ మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలలో మంచి మార్కులు సాధించి తమ తల్లిదండ్రులకు చదివిన పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకురావాలని ఆయన కోరారు. మంచి విద్యతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. విద్యార్థులకు ప్యాడ్లను అందించిన స్వామినాథ్ గారిని పాఠశాల ఉపాధ్యాయ బృందం శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు సంతోషి, ఉపాధ్యాయ బృందం నరసింహులు, నరేందర్, భారతి, సుస్మిత, రాము తదితరులు పాల్గొన్నారు.
