

ముందే ఎండాకాలం భగ్గు భగ్గుమంటున్న వేడిలో చంకలో పసి పిల్లలను ఎత్తుకొని గంటలకొద్దీ బస్సుల కోసం నిలబడాలంటే ఏలా
నిలువ నీడ లేదు కూర్చునే పరిస్థితి లేదంటున్నా ప్రయాణికులు
మనన్యూస్,గద్వాల:జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామం ఈ గ్రామ స్టేజి NH44 నేషనల్ హైవే రోడ్డు హైదరాబాద్ రూటుకు వెళ్లే మార్గంలో బస్సు షెల్టర్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. నిలువ నీడ లేక పాట్లు పడుతున్నారు. బస్సుల కోసం రోడ్డు పక్కనే గంటలు గంటలు పడిగాపులు కాస్తున్నారు.ముందే ఎండాకాలం బస్సుల కోసం ఎండలోనే గంటలకొద్దీ నిరీక్షణ చెయ్యాల్సి వస్తుంది.ఈ సమయంలో పసి పిల్లలకు మాకు ఎండ తీవ్రతను బట్టి ఎండ వడ దెబ్బలు తగిలితే ప్రాణాలు పోవాల్సిందే అంటున్నారు.ప్రయాణ ప్రాంగణం లేక ఇక్కట్లు పడుతున్నాము నిలువ నీడ లేదు కూర్చునే పరిస్థితి లేదు రోడ్డు పక్కనే మేము గంటలకొద్ది పడిగాపులు కాస్తున్నాము ఇక ఒంటికి, రెంటికి వస్తే ఇక కష్టమే. ఈ స్టేజి నుండి అధికారులు, పారిశ్రామిక వేత్తలు, వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు జల్లాపురం , చండూరు, పల్లెపాడు, మారమునగాల, ఈ ప్రాంత గ్రామాల నుంచి రాకపోకలు సాగిస్తుంటారు.మండల కేంద్రం అయినా మానవపాడు అలాగే ఎర్రవల్లి చౌరస్తా, జోగులాంబ జిల్లా కేంద్రం అయినా గద్వాల , పెబ్బేర్ , మహబూబ్ నగర్, హైదారాబాద్ ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రజలు జల్లాపురం గ్రామ స్టేజికి రాక తప్పదు. ఈ స్టేజిన బస్ షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు రోడ్డు పక్కనే తమ చంకలో పసి పిల్లలను ఎత్తుకొని గంటలకొద్దీ నిలబడాలి వస్తుంది. ఎండకు ఎండుతూ వర్షానికి తడవాల్సి వస్తుంది. బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని జల్లాపురం గ్రామానికిచెందిన సామాజిక కార్యకర్త శాంతకుమార్ మరియు ప్రయాణికులు స్థానికులు కలిసి పాలకులను, అధికారులను కలసి తమతో విన్నవించిన ఎలాంటి ఫలితం ఉండటం లేదని వాపోతున్నారు. ప్రభుత్వాలు మారినా NH44 నేషనల్ హైవే రోడ్డు పక్కన బస్సు షెల్టర్ ఏర్పాటు కళ నెరవేరడం లేదంటున్నా శాంతకుమార్ ఇప్పటికైనా స్పందించి బస్ షెల్టర్ నిర్మించాలని జల్లాపురం గ్రామ సామాజిక కార్యకర్త శాంతకుమార్ కోరుతున్నారు
