

మనన్యూస్,కామారెడ్డి:రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి చెందిన గజ్జల లింగం గతంలో పొలం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించగా,విద్యుత్ శాఖ ఎక్స్గ్రేషియా క్రింద రు 5 లక్షల రూపాయల విలువ గల చెక్కును శుక్రవారం విద్యుత్ అధికారులతో కలిసి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబానికి అందజేశారు.బాధిత కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని మోహన్ రెడ్డికి గతంలో తెలియచేయగా,వరంగల్ వెళ్లి విద్యుత్ అధికారులతో మాట్లాడి చెక్కు రావడానికి కృషి చేశారని,వారికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కల్లూరి రగోతం రెడ్డి,రెడ్డి నాయక్,బంటి ప్రవీణ్,దుంపల బాలరాజు,పెండ్యాల నర్సారెడ్డి,గజ్జల చిన్న రాజు,తోట లింగం,గజ్జల రాజు,తదితరులు పాల్గొన్నారు.
