

బంగారుపాళ్యం మార్చ్ 2 మన న్యూస్
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మొగిలి దేవస్థానం నందు వెలసిన శ్రీ కామాక్షి సమేత మొగిలిశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా 9వరోజు ఆదివారం బ్రహ్మరథోత్సవాన్ని బెంగళూరుకు చెందిన ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ నర్సరాజు కుమారుడు నరసింహారాజు( రమేష్ రాజు) గత 40 సంవత్సరాలకు పైగా వంశపార కార్యకర్తలు బంగారుపాళ్యం మాజీ జమిందార్ సుబ్బరామప్ప నాయన వారు, జమీందారు వంశస్థులు విజయకుమార్, జమీందారు అ వంశస్థుల ఆధ్వర్యంలో బ్రహ్మరథోత్సవాన్ని సొంత వ్యయంతో ఏర్పాటు చేసి ఏర్పాటు చేస్తే ప్రతి సంవత్సరం ముగిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవానికి మొదటి పూజ నిర్వహించి జమీందారీ వంశస్థులతో కలసి నరసింహారాజు పూజా కార్యక్రమం నిర్వహించి రతాన్ని లాగి ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఎంబి కుమార్ రాజా మాట్లాడుతూ, మొగిలి ఆలయ అభివృద్ధికి పార్టీలకతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చునని కోరారు. మొగిలి శ్వర ఆలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని ఆలయ ధర్మకర్త ఎంపీ విజయకుమార్, ఆలయ ఈవో మునిరాజులు కోరారు. అనంతరం బ్రహ్మరథోత్సవాన్ని నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు చేసి భక్తులకు కనువిందు చేసి దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అధికారులు భక్తులకు పసుపు కుంకుమతోపాటు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ బ్రహ్మ రథోత్సవానికి తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మొగిలీశ్వర స్వామిని దర్శించుకున్నారు.