ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో యువతకు ఉద్యోగాల కల్పన కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విశేష కృషి: మధు యాష్కి గౌడ్

మనన్యూస్,ఎల్ బి నగర్:కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 56 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత తమ రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్,మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ పేర్కొన్నారు.ఫాక్స్ కాన్ కంపెనీ లో ఉద్యోగాల కల్పనలో భాగంగా మధుయాష్కి గౌడ్ ఆధ్వర్యంలో జాబ్ మేళాను శనివారం హస్తినాపురం లోని ఏఎంఆర్ కన్వెన్షన్ హల్ లో నిర్వహించారు. మహిళలు,యువతులు పెద్ద సంఖ్యలో జాబ్ మేళాలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన పలువురికి నియామక పత్రాలను మధుయాష్కీ అందజేశారు.ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ గారు కూడా నిరుద్యోగ సమస్య రూపుమాపే విషయంపై పోరాడుతున్నారన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో దేశ విదేశాల నుంచి కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.యువత ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలన్నారు.ఫాక్స్ కాన్ కంపెనీ వారు నగరానికి 70 కిలోమీటర్ల పరిధిలో ఉచిత బస్సు, ఉచిత భోజనం,ఈ ఎస్ ఐ, పీ ఎఫ్ సదుపాయాలను కల్పిస్తూ, ఉద్యోగాలు ఇస్తున్నారని,యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఎల్.బి.నగర్,మహేహశ్వరం,ఇబ్రహీంపట్నం ప్రాంతాల వాసులు ఉద్యోగాలు పొంది ఆర్ధిక ఉపశమనం పొందవచన్నారు. కాలనీలు బస్తీలలోనూ జాబ్ మేళాలు నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులకు ఈ సందర్భంగా సూచించారు. ఫాక్స్ కాన్ కాంపెనీలో 90 శాతం యువతులకు,10 శాతం యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్,కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్,మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ నేలపాటి రామారావు,పాశం అశోక్ గౌడ్,బుడ్డా సత్యనారాయణ,టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ ఆంగోతు వెంకటేష్,నాయకులు గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి,దాము మహేందర్ యాదవ్,శశిధర్ రెడ్డి,కొండోజు శ్రీనివాస్, విద్యా రెడ్డి, ఫాక్స్ కాన్ కంపెనీ ప్రతినిధులు మణికంఠ, లోకేష్,రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    హసన్‌పల్లి గ్రామంలో విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం: మన ధ్యాస న్యూస్ కథనానికి స్పందన

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండు సంవత్సరాలుగా అధిక లోడు కారణంగా విద్యుత్ సరఫరాలో తీవ్రమైన సమస్యలు కొనసాగుతూ ఉండగా,మన ధ్యాస దినపత్రిక ఆదివారం ఒక కథనాన్ని ప్రచురించింది.ఇందులో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి వదిలివేయబడినట్లు, అందువల్ల…

    ట్రాన్స్ఫార్మర్‌ పెట్టారు.. కాలిపోయింది వదిలేశారు..ఇది విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం..

    మన ధ్యాస, నిజాంసాగర్ (జుక్కల్):మొహమ్మద్ నగర్ మండలంలోని హసన్‌పల్లి గ్రామంలో గత రెండేళ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రరూపం దాల్చాయి. గ్రామంలోని మినీ ట్రాన్స్ఫార్మర్‌పై అధిక లోడు పడడం వల్ల తరచూ వైర్లు తెగిపడి కరెంటు సరఫరా నిలిచిపోతోంది.గ్రామస్థుల సమాచారం ప్రకారం,ఒకే ట్రాన్స్ఫార్మర్‌కు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    • By JALAIAH
    • September 10, 2025
    • 4 views
    కొండేపి నియోజకవర్గంలో బాలినేని ప్రణీత్ రెడ్డి  ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    ఏపీఆర్డిసీ సభ్యుడుగా వెన్న ఈశ్వరుడు (శివ)..

    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    • By JALAIAH
    • September 10, 2025
    • 5 views
    జాతీయస్థాయి టార్గెట్ బాల్ పోటీలకు సింగరాయకొండ జెడ్. పి హై స్కూల్ విద్యార్థులు

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    నిరుపేద కుటుంబాలకు జనసేన క్రియాశీలక సభ్యత్వం ఆసరా…

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    పౌష్టిక ఆహారం ద్వారానే తల్లి బిడ్డ కు ఆరోగ్యం..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..

    ఆర్ అండ్ బి అధికారులపై పనితీరుపై రాష్ట్ర ఉన్నత అధికారులకు ఫిర్యాదు..