

మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం:పట్టణంలోని ఆగ్జిలియం ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల సైన్స్ ప్రదర్శనలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అగ్జిలియం విద్యాసంస్థ పూర్వ విద్యార్థి స్పార్క్(సైంటిఫిక్ ప్రోగ్రాం ఫర్ అకాడమిక్ రీసెర్చ్ క్యూబ్) చైర్మన్ సాయి సందీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.సందీప్ విద్యార్థులకు సైన్స్ యొక్క ప్రాముఖ్యతను వివరించి, ఈ రోజుల్లో విజ్ఞానం,సాంకేతికత మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో గ్రహించడం ఎంతో అవసరమని.చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెంచుకోవాలి ఈ తరహా సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులలో పరిశోధనా దృక్పథాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. విద్యార్థులు కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథి తన పాఠశాల కాలాన్ని, సవాళ్లను, విజయాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ సుపీరియర్ సిస్టర్ ప్రిమిలా మాట్లాడుతూ చిన్న వయసులోనే సందీప్ ఇప్పటికే ఇస్రో స్పేస్ ట్యూటర్ మరియు సైబర్ ఎక్స్పెక్ట్ గా పలు సేవలు సమాజానికి అందించారని,విద్యార్థులు సాయి సందీప్ ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఎందుకంటే.“ఒక విద్యార్థి మా పాఠశాలలో చదివి, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకొని, మళ్లీ ఇదే పాఠశాలకు ముఖ్య అతిథిగా రావడం నిజంగా ఇది మా సంస్థకు గొప్ప గర్వకారణం” అని పేర్కొన్నారు. ముఖ్య అతిథి సాయి సందీప్‌ను ఆగ్జిలియం యాజమాన్యం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, విజ్ఞాన ప్రదర్శనలో అనేక ప్రయోగాలను అందుబాటులో ఉంచారు. ముగింపు సందర్భంగా సాయి సందీప్, ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేశారు.విద్యార్థులు ఆయనను చూసి ప్రేరణ పొందారని, ఈ తరహా కార్యక్రమాలు మరింత ప్రోత్సాహాన్నిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ సందర్భంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సాయి సందీప్ తో సంభాషించి,ఆయా విషయాలపై జిజ్ఞాస వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్పార్క్ సీఈఓ ప్రదీప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆదిత్య ,సాహుల్, నీరజ్, కామేష్, వివిధ ప్రదర్శలపై అవగాహన కల్పించారు,