

మనన్యూస్,నెల్లూరు:మిని బైపాస్ రోడ్,జిపిఆర్ కళ్యాణ మండపంలో శుక్రవారం ఉదయం టైలరింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు జరిగాయి.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నుడా చైర్మన్,తెలుగుదేశం నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఈ టైలర్ అసోసియేషన్ కు భవన నిర్మాణం స్థలము మంత్రులు పొంగూరు నారాయణ,ఆనం రామనారాయణ రెడ్డి,ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లతో మాట్లాడి స్థల సేకరణ చేసి నుడా ఆధ్వర్యంలో భవన నిర్మాణం చేసి ఇస్తాము అని అన్నారు.టైలర్స్ మనకు అందంగా దుస్తులు కుడుతారు,కానీ వారి కొందరి జీవితాలు అంద దీనంగా ఉన్నాయి.వాళ్లకు ప్రభుత్వం తరఫున జరగవలసిన సహాయం ఏర్పాటు చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.బాబు,నెల్లూరు నగర ప్రెసిడెంట్ షేక్ గులామ్ ఖాదర్,రాష్ట్ర గౌరవ ప్రెసిడెంట్ బి శ్రీనివాసులు,జిల్లా గౌరవ ప్రెసిడెంట్ సయ్యద్ మాదర్,నగర,జిల్లా ట్రెజరర్ షేక్ బాబు,రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పి.మురళీకృష్ణ, జిల్లా సెక్రెటరీ పి యానాదయ్య, జిల్లా వైస్ ప్రెసిడెంట్ వి శ్రీనివాసులు, నగర సెక్రటరీ ఎస్ కమురుద్దీన్, నగర ఉపాధ్యక్షులు కుమార్,జె.మోహన్, జి.సురేష్, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా ప్రచార కార్యదర్శి శేషు, జిల్లా గౌరవ సలహాదారులు సుందరం, సుబ్రహ్మణ్యం,నగర కమిటీ సభ్యులు షేక్ బాబు సోనీ టైలర్స్షే షేక్ బాబు ఐశ్వర్య టైలర్స్ , షేక్ సిరాజ్,షేక్ ఆరిఫ్ మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం టైలర్స్ కు విందు భోజనం ఏర్పాటు చేశారు.