

మన,న్యూస్,గొల్లప్రోలు:దుర్గాడ గ్రామంలో.. ప్రసిద్ధిగాంచిన శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి లింగోద్భవ కాలాభిషేకం వైభవంగా జరిగినది. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు ,దత్తు సోదరులు..మరియు పండిత బృందము మహాగణపతి పూజ, మహన్యాస పారాయణ గావించి 121 రుద్రములతో,21ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో, రజత
జటాఝూటముతో అలంకరణ. నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.ఆలయ ప్రాంగణంలో భక్తుల వీక్షణార్థం ఆలయ సేవా సభ్యులు ప్రత్యేక ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాట్లు చేసారు.నేటితో కళ్యాణ మహోత్సవాలు ముగుస్తాయి అని ఆలయ సేవా బృందం తెలియజేశారు.