

మన న్యూస్,నిజాంసాగర్,( జుక్కల్ ): ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు కృషి మరువలేనిదని ఎమ్మార్పీఎస్ పార్టీ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జుక్కల్ ఎమ్మెల్యే హైదరాబాద్లోని తన నివాసానికి మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి శాలువాతో ఘనంగా సన్మానించి అనంతరం విందు భోజనం ఏర్పాటు చేశారు. ఆత్మీయ విందులో పాల్గొన్న మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎనలేని కృషి చేశారని, ఆయన చేసిన సేవలను అభినందిస్తున్నట్లు కొనియాడారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు చెందిన ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, అభివృద్ధి ఫలాలు అందేలా భవిష్యత్ కార్యాచరణ కొనసాగించాలని సూచించారు. అనంతరం మందకృష్ణ మాదిగ వెంట వచ్చిన ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవింద్ నరేష్, ప్రముఖ రచయిత మచ్చ దేవేందర్, పాటమ్మ రాంబాబు, జైభీమ్ టీవీ సంస్థల చైర్మన్ బరిగెల శివ తదితరులను ఎమ్మెల్యే లక్ష్మి కాంతారావు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

