మనన్యూస్,ఎల్బీనగర్,హైదరాబాద్:ఉద్యోగ భద్రత,ప్రమోషన్లు,ఆరోగ్య భద్రత,జిహెచ్ఎంసి చెత్త రవాణా వంటి అంశాలపై ప్రధాన ఎజెండా గత పాలకుల్లాగా దర్వాజాలు బంద్ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ది కాదు నిరసనలు తెలుపకుండానే జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తాం మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐ ఎన్ టి యు సి,ఎల్బీనగర్ జోన్ జిహెచ్ఎంసి కార్మికుల సమావేశంలో ఎమ్మెల్సీ,ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్ మహానగరంలో జిహెచ్ఎంసి కార్మికులు చేస్తున్నటువంటి సేవ కాంగ్రెస్ ప్రభుత్వం పాలకులు కచ్చితంగా గుర్తిస్తారని,కార్మికుల సమస్యల పరిష్కారానికి మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐ ఎన్ టి యు సి,టీజేఏసీ,జిహెచ్ఎంసి కార్మిక యూనియన్ నాయకులతో కలిసి ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించుకుంటామని ఎమ్మెల్సీ ప్రొఫెసర్, కోదండరాం అన్నారు.మంగళవారం ఎల్బీనగర్ నియోజకవర్గం జిహెచ్ఎంసి ఎల్బీనగర్ సరూర నగర్ సర్కిల్ కార్యాలయం ఆవరణలో మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐ ఎన్ టి యు సి,జిహెచ్ఎంసి కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం హాజరై టీజేఏసీ(తెలంగాణ జన సమితి)సంపూర్ణ మద్దతు తెలిపారు.మునిసిపల్ సహకార్ మజ్దూర్ యూనియన్ ఐ ఎన్ టి యు సి ఆల్ ఇండియా అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి,వైస్ ప్రెసిడెంట్ జనక్ ప్రసాద్,ఐ ఎన్ టి యు సి ఆల్ ఇండియా వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ జనరల్ సెక్రెటరీ ఆదిల్ షరీఫ్ వంటి ప్రముఖులతో కలిసి కోదండరాం హాజరయ్యారు ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కార్మిక యూనియన్ నాయకులు పలు సమస్యలను కోదండరాం దృష్టికి తీసుకువెళ్లారు.అనంతరం ఎమ్మెల్సీ,ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ గత పాలకుల్లాగా కార్మికుల సమస్యలపై దర్వాజాలు బంద్ పెట్టి నిరంకుశ తత్వంగా వ్యవహరించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలకులు ఎప్పటికీ వ్యవహరించారని కోదండరాం పునరుద్ఘాటించారు.గతంలో కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పాలకులను కలిసే పరిస్థితి లేదన్నారు. కానీ ప్రజల సహకారంతో,ప్రజల యొక్క సంపూర్ణ మద్దతు తెలంగాణలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ కార్మిక పక్షపాతిగానే వ్యవహరిస్తుందన్నారు గ్రేట్ హైదరాబాద్ లో జిహెచ్ఎంసి కార్మికులు చేస్తున్నటువంటి విధి నిర్వహణ ప్రభుత్వం తప్పక గుర్తిస్తుందన్నారు.విపత్కర కరోనా పరిస్థితుల్లో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రాణాల సైతం ప్రాణంగా పెట్టిన జిహెచ్ఎంసి కార్మికులు తమ విధులకు హాజరై ప్రజారక్షణలో భాగస్వాములు అయ్యారని గుర్తు చేశారు.ప్రధానంగా కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో కార్మికులకు ప్రమోషన్లు,ఉద్యోగ భద్రత,ఆరోగ్య భీమా,జిహెచ్ఎంసి చెత్త రవాణా రంగం ప్రైవేటీకరణ వంటి అంశాలపై ఐ ఎన్ టి యు సి,జిహెచ్ఎంసి కార్మిక,ఉద్యోగ సంఘాల నాయకులు,టీజేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతామన్నారు.గత పాలకులు సమస్యలు పరిష్కారం కోసం వస్తే కార్మికులను భయభ్రాంతులను గురిచేసి అలసి వేసే ధోరణిగా వ్యవహరించారన్న సంగతి తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరువారన్నారు అలాంటి సందర్భంలోనే తాము కూడా కార్మిక ఉద్యోగ సంఘాలతో కలిసి నిరసన చేపట్టడం జరిగిందన్నారు.జిహెచ్ఎంసి కార్మికుల సమస్యలకు మున్ముందు ఇలాంటి పరిస్థితులు రాకూడదని ఉద్దేశంతోనే ప్రభుత్వంతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కే శివకుమార్,ఎం శివరాజ్,ఆర్ మహేష్,సిహెచ్ నరసింహ,శరంజిత్ సింగ్(బంటి ),యాదగిరి,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *