

మన న్యూస్, నిజాంసాగర్, బాన్స్ వాడ,
కామారెడ్డి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ గంజాయి తరలిస్తున్న ముఠాను వెంబడించి 90 కిలోల 830 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అన్నారు. మంగళవారం బాన్సువాడ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాంధారి మండలంలోని జెమిని తండాకు చెందిన సత్నం, వినోద్, శంకర్, నల్గొండ జిల్లాలోని అంబాల గ్రామ చెందిన తిరుపతి అనే వ్యక్తులు గంజాయిని ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల నుండి తీసుకువచ్చి కర్ణాటక సరిహద్దుల్లో నిల్వచేసి అక్కడి నుండి మహారాష్ట్ర నాందేడ్ తదితర ప్రాంతాలకు తరలిస్తుండగా నమ్మదగిన సమాచారం మేరకు మంగళవారం ఉదయం నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామ శివారులో ఎక్సైజ్ పోలీసులు గంజాయి తరలిస్తున్న రెండు కార్లను వెంబడించగా ఒక కారును పట్టుకోవడం జరిగిందని మరొక కారు పరారైనట్లు తెలిపారు. గంజాయి తరలిస్తున్న స్కార్పియో వాహనము, ద్విచక్ర వాహానంతోపాటు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేయగా వారి నుండి 90 కిలోల 830 గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగిందని వీటి విలువ సుమారు 50 లక్షల రూపాయల వరకు ఉంటుందన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు ఆయన తెలిపారు. గంజాయి విక్రయించిన తరలించిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.