

మనన్యూస్,సాలూరు:1/70 చట్టాన్ని ప్రభుత్వం తొక్కు పెట్టి గిరిజన ప్రాంతాలను బడ వ్యాపారస్తులకు పారిశ్రామిక వేత్తలకు అప్పజెప్పాలని ఈ ప్రభుత్వం చూస్తుందని.గిరిజలంతా ఏకమై ఈనెల 11,12 గిరిజన సంఘాలు ఇచ్చిన బందుకు అందరూ సంపూర్ణ మద్దతు పలికి అధిక సంఖ్యలో పాల్గొని బందును జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి పిడికి రాగన్న దోర అన్నారు. సోమవారం ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమతా NGO సుప్రీం కోర్ట్ ద్వారా గిరిజన భూమి రక్షణ కోసం తీసుకొచ్చిన జడ్జిమెంట్ నే సమతా జడ్జిమెంట్ అని పిలుస్తారని అన్నారు.
సుప్రీంకోర్టు 1997 లో జడ్జిమెంట్ ఇచ్చిందని.ఈ విధంగా సమతా జడ్జిమెంట్ ప్రకారం గిరిజన షెడ్యూల్డ్ ప్రాంతం నుండి 1 సెంట్ భూమి తీసుకోవాలని వున్నా సంబంధిత గ్రామా సభ తీర్మానం మరియు ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి తీర్మానం తప్పని సరిగా తీసుకోవాలని అన్నారు.తెలుగు దేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చిన గిరిజన అనగదొక్కాలని చూస్తుందని ఇందులో భాగంగానే 1/70 చట్టాన్ని తొక్కపెట్టి గిరిజనుల ప్రాంతాలను వ్యాపారులకు, పారిశ్రామిక వేత్తలకు అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తుందని తెలిపారు.ఈ విషయం స్పీకర్ అయ్యన్న పాత్రులు మాటలు ద్వారా స్పష్టంగా అర్ధం అవుతుందని దీనిపై గిరిజనులందరూ గ్రహించుకోవాలని అన్నారు.గతంలో అనగా 2 వ సారి ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు వున్నప్పుడు కూడా ఈ 1/70 చట్టాన్ని ,మార్చాలని ప్రయత్నం చేసారు.ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ లతో కలిసి గిరిజనులకు కొండలు లేకుండా చేయలని ప్రయత్నం చేస్తుందని అన్నారు.గిరిజనులకు అండగా భారత రాజ్యాంగంలోని 5 వ షెడ్యూల్డ్ ఆర్టికల్ 244 మరియు 1997 లో సుప్రీం కోర్ట్ ఇచ్చిన సమతా జడ్జిమెంట్ వున్నదని తెలిపారు.కాబట్టి నిజమైన గిరిజనులు,గిరిజన సంఘాలు మరియు నిజమైన గిరిజన నాయుకులు,నిజమైన గిరిజన MLA లు నిజమైన గిరిజన మంత్రులు అదేవిధంగా గిరిజన శ్రేయోభిలాషులు ఫిబ్రవరి11 ,12 న అనగా మంగళవారం,బుధవారం ఆంధ్రప్రదేశ్ గిరిజన ప్రాంతంలో జరపతలపెట్టిన బంధునకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని మరియు విజయవంతం చేయలని సాలూరు నియోజకవర్గం గిరిజనుల తరుపున కోరుతున్నానని ఆయన తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు నెమలి పిట్ట కళ్యాణ్,కౌన్సిలర్ సింగరపు ఈశ్వరరావు,వైసిపి నాయకులు పిరిడి రామకృష్ణ, మద్దిల గోవిందా,తాడ్డి శంకరరావు,శివరాంపురం సర్పంచ్ జార్జాపు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.