

మనన్యూస్,గొల్లప్రోలు:కాకినాడ జిల్లా,గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో ప్రసిద్ధిగాంచిన శివాలయంలో పంచాయతన సమేత స్వయంభు ఆలయంలో వేంచేసినటువంటి శ్రీ సూర్య భగవానుడికి ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తు సోదరులు ప్రత్యేక అభిషేకాలు,అలంకరణలు,నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.ఆలయ ముఖ మండపములో ప్రముఖ స్మార్త పండితులు
కారుణ్య శర్మ, కార్తీక శర్మ ఆధ్వర్యంలో త్రిచ సౌర విధానముగా సూర్య నమస్కారాలు నిర్వహించారు.ఈ సందర్భంగా రంగవల్లులతో వేసిన సూర్య భగవానుడి అశ్వములు రధముతో కూడిన చిత్రం భక్తులను విశేషముగా ఆకట్టుకున్నది ఆలయ ఆరుబయట ప్రాంగణ ఆవరణలో ప్రత్యక్ష సూర్యభగవానుడికి ఎదురుగా ఏరు పిడకలతో పాలు పొంగించి,క్షీరాన్నం వండి నివేదన చేశారు.ఆలయ సేవా సభ్యులు పండితుల ఆధ్వర్యంలో భక్తులకు అందరికీ తీర్థ,ప్రసాదములు వినియోగం చేశారు.