

మనన్యూస్,హయత్ నగర్:దేశంలో రాజ్యాంగ విలువల పైన,ప్రజాస్వామ్య వ్యవస్థ పైన దాడి జరుగుతుందని మరియు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి విధానాలు సక్రమంగా అమలు జరగడం లేదని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య అన్నారు.
తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ విస్త్రృత స్థాయి సమావేశం ఆదివారం హైదరాబాద్(అబిడ్స్)లోని టిపిటిఎఫ్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై చర్చించి రాష్ట్ర కమిటీ అనేక తీర్మానాలు చేయడం జరిగింది.1.రాజ్యాంగ,ప్రజాస్వామ్య విలువలపై పరివార్ పాలకుల దాడిని ఖండిస్తున్నాం.మనువాద పునరుద్ధరణ వాదాన్ని వ్యతిరేకిస్తున్నాం.2.రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలను చాటుతున్న వ్యక్తులపై సంస్థలపై చేస్తున్న ప్రత్యక్ష పరోక్ష దాడులను తీవ్రంగా నిరసిస్తున్నాం.3.కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని,నిర్లక్ష్యాన్ని తెలంగాణపై జరిగిన ఆర్థిక దాడిగానే భావిస్తున్నాం.4.సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి తెలంగాణలో వేగవంతంగా ఎస్సీ ఎస్టీ వర్గీకరణను అమలు చేయాలి.5.పెట్టుబడుల పేరుతో కార్పొరేటికరించడాన్ని వ్యతిరేకిస్తున్నాం.6.ప్రజాస్వామ్య పునరుద్ధరణ హమీని రాష్ట్రంలో సమగ్రంగా అమలుపరచాలి.7.హైడ్రా,మూసి పునరుద్ధరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తున్నాం.పేదలకు పునరావాసం కల్పించిన తర్వాతనే,సమగ్రమైన డిపిఆర్ రూపొందించాకే నిర్ణయాలు అమలు జరగాలి.8.గుజరాత్ సామూహిక హత్యఖాండకు గురైన పార్లమెంటు సభ్యుడు ఎహసాన్ జాఫ్రీ సహచరి హత్యాకాండపై సుదీర్ఘ న్యాయపోరాటం చేసి ఆ వ్యవస్థ యొక్క బలహీనతలను బహిర్గతం చేసిన జకియా ఆఫాకు మరియు హైదరాబాద్ అంకుశ్ చిన్న సహచరి రమ మరణానికి, విద్యావంతుల వేదిక సభ్యులు చెప్యాల ప్రభాకర్ లకు జోహార్లు అర్పిస్తున్నాం.9.రాష్ట్ర మహ సభలు ఏప్రిల్ 12,13 తేదిలలో హైదరాబాద్ లో నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది.ఈ మహాసభలు 75 ఏళ్ల భారత రాజ్యాంగం ప్రధాన భూమిక గా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది.10.పోర్తు సిటి సహా ఇతర అభివృద్ధి పథకాలకు వ్యవసాయేతర భూములను మాత్రమే సేకరించాలి.ఇట్టి భూములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి.11.తెలంగాణ నాగరిక పరిణామాన్ని,చైతన్యాన్ని ప్రశ్నార్ధకం చేస్తున్న కుల దురహంకార హత్యలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలి అని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య,తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రధాన కార్యదర్శి డా:తిప్పర్తి యాదయ్య తెలిపారు.