

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలకేంద్రంలోని వసంత పంచమి సందర్భంగా శ్రీ జోగులాంబ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న సహస్ర కలశాభిషేకం,చండీ హోమం,అభిషేకం కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే ఎమ్మెల్యే విజయుడు,చల్లా అగస్త్య రెడ్డి పాల్గోన్నారు.ఆలయాలకు విచ్చేసిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కి,ఎమ్మెల్యే విజయుడు కి ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఆహ్వానించారు.శేష వస్త్రాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.