విద్యుత్ షాక్ కు గురై గాయపడిన భాధితులను పరామర్శించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్.

బంగారుపాళ్యం ఫిబ్రవరి 1 మన న్యూస్

పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, జంబువారిపల్లె గ్రామంలో శుక్రవారం రాత్రి ఓంశక్తి అమ్మవారి ఊరేగింపు సందర్భంగా జరిగిన దుర్ఘటనలో విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్‌కు గురై గాయపడిన భాధితులను పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ పరామర్శించారు. శనివారం సాయంత్రం జంబువారిపల్లె గ్రామానికి చేరుకున్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ , బంగారుపాళ్యం మండల పార్టీ అధ్యక్షులు ఎన్.పి. జయప్రకాష్ గారు మరియు ప్రభుత్వ అధికారులతో కలిసి గాయపడిన వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇంటింటికి వెళ్ళి గాయపడిన వారి ఆరోగ్య పరిస్ధితిని అడిగి తెలుసుకున్నారు. భాధితులకు పండ్లు అందజేస్తూ, అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఆయన గ్రామం అంతా పర్యటించి విద్యుత్ సమస్యలను పరిశీలించి, మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారి కోటయ్యకు ఆదేశాలు ఇచ్చారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలోని విద్యుత్ సరఫరా తక్షణమే పునరుద్ధరించాలని, ప్రమాదకరంగా ఉన్న తీగలను సవరించాలని సూచించారు. అనంతరం, వైద్య అధికారులతో మాట్లాడి క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. భాధితుల ఇంటికి వెళ్లి, వారికి వైద్య సేవలు అందేలా చూడాలని వైద్య అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గ్రామ ప్రజలు ఎమ్మెల్యే మురళీమోహన్ స్పందనను ప్రశంసించారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… ఓంశక్తి అమ్మవారి ఊరేగింపులో “ఈ సంఘటన చాలా బాధాకరమని, గాయపడిన వారికి పూర్తి సహాయం అందేలా చూస్తామన్నారు. వారంతా త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చామని, గ్రామంలోని ప్రజలు భయపడకుండా, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను” అని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు. ఈ కార్యక్రమమలో బంగారుపాళ్యం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు, మండల ప్రధాన కార్యదర్శి జనార్థన్ గౌడ్, మండల వైస్ ప్రెసిడెంట్ కమలనాధ్, జంబువారిపల్లె సర్పంచ్ అమరావతి, నాయకులు సూరి మరియు మండల నాయకులు, కార్యకర్తలు, విద్యత్ శాఖ అధికారులు, వైద్య అధికారులు, జంబువారిపల్లె గ్రామస్తులు పాల్గోన్నారు.

  • Related Posts

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ జిల్లా కిర్లంపూడి లో గురువారం రాజమహేంద్రవరం కి చెందిన పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు మాజీ మంత్రి వైసిపి పిఏసి సభ్యులు ముద్రగడ పద్మనాభం ను మర్యాదపూర్వకంగా కలిశారు.…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    శంఖవరం మన ధ్యాస ప్రతినిధి:- కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కృషితో ప్రత్తిపాడు నియోజకవర్గంలో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. వివరాల్లోకెళ్తే.. శంఖవరం మండలంలో గిరిజన గ్రామాలైన వేళంగి,పెదమల్లాపురం తదితర గ్రామాలకు నిలిచిపోయిన ఆర్టీసీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed Mana News updates

    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    • By NAGARAJU
    • September 12, 2025
    • 2 views
    నేపాల్ లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడటంలో లోకేష్ బాబు చొరవ చూపర్… రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వ కార్యదర్శి బొల్లినేని వెంకట రామారావు…

    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    • By NAGARAJU
    • September 12, 2025
    • 3 views
    కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం – అమరావతి కేంద్రంగా అర్బన్‌ జిల్లా..///

    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    • By NAGARAJU
    • September 12, 2025
    • 6 views
    నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్ గా హమాన్స్ శుక్ల నియామకం..//

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ముద్రగడ పద్మనాభం ను కలిసిన పంతం..

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కృషితో గిరిజన గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం…

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

    చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు