

మనన్యూస్,తిరుపతి:నగరంలో నివసిస్తున్న ప్రతి పేద కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య పిలుపునిచ్చారు.తుడా కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన సిటీ లెవెల్ టాస్క్ ఫోర్సు కమిటీ సమావేశం శనివారం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా),దీనదయాళ్ జాతీయ పట్టణ జీవనోపాధుల సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని జీవనోపాధుల కల్పనకు సంబంధించిన అన్ని శాఖలు,పరిశ్రమలు,అధికారులు,స్వచ్చంద సంస్థలు,స్వయం సహాయక సంఘ సభ్యులతో సిటీ లైవిలిహుడ్ టాస్క్-ఫోర్సు(CLTF)కమిటీని ఏర్పాటు చేయడమైనదని అన్నారు.ఈ కమిటీ ఆధ్వరంలో రాబోయే ఐదు సంవత్సరాలకు పట్టణంలోని నిస్సహాయులు,పేదలు అందరికీ సుస్థిర జీవనోపాధులు కల్పించే అవకాశాలు,అవసరమైన సమన్వయము, అవసరమైన కార్యక్రమాలతో సిటీ లైవిలిహుడ్ యాక్షన్ ప్లాన్ రూపొందించ బడుతుందని అన్నారు.ni-msme భాగస్వామ్యంతో లైన్-డిపార్టుమెంటు సిబ్బందికి,CLTF కమిటీ సభ్యులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని అన్నారు.తద్వారా ఉద్యోగ అవకాశాల విస్తరణ,స్వయం ఉపాధి అవకాశాల కల్పన,పట్టణ ప్రాంతాల్లో జీవనోపాధి అవకాశాలను పెంపొందించేందుకు వీలుంటుందని అన్నారు.ఈ విధంగా కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన,ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు ప్రతి మునిసిపల్ అధికారులు,స్వచ్ఛంద సంస్థలు,యువత,మహిళా సంఘాలు అందరూ సహకరించాలని అన్నారు.ఈ ప్రాజెక్ట్ ద్వారా పట్టణ పేదరికాన్ని తగ్గించేందుకు పెద్దఎత్తున ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఇది నగరాల్లో స్థిరమైన అభివృద్ధికి మార్గం వేస్తుందని,మెరుగైన జీవనోపాధిని అందించేందుకు దోహదపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ డి.రవీంద్ర, Ni-MSME నుండి రాజేంద్ర ప్రసాద్, సి.ఎం.ఎం. యస్.కృష్ణవేణి,యస్.సోమ కుమార్, కమిటిమెంబెర్స్ లేబర్ఆఫీసర్,జి.యం.ఇండస్ట్రీస్, జూనియర్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్, మార్కెటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.