

మనన్యూస్,సరూర్నగర్:పోలీస్ స్టేషన్ లోని హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న మౌలాన్ ఏఎస్ఐగా పదోన్నతి పొందారు ఈ సందర్భంగా సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లోని సీఐ సైదిరెడ్డి,సహోద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మౌలాన్ మాట్లాడుతూ తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ,తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్ లోనే పదోన్నతి పొందడం ఆనందంగా ఉన్నదన్నారు.తన కర్తవ్యం లో మరింత బాధ్యత కలిగి,శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.